దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉదృతి రోజురోజుకి పెరిగిపోతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. అయినా కూడా దేశంలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం లేదు. ప్రతి రోజు కూడా 30 వేలకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 34,956 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరో 687 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,03,832కి చేరింది.
దేశంలో కరోనా జోరు కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తికీ కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో ఆసుపత్రిలో బెడ్ కేటాయించాలని అడగ్గా .. బెడ్స్ ఖాళీగా లేవని కేటాయించలేదు. దీనితో ఆ వ్యక్తి ఏకంగా సీఎం ఇంటి ముందుకి వెళ్లి ఆందోళనకి దిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ ఘటన కర్ణాటక సీఎం యడ్డ్యూరప్ప సీఎం ఇంటి ముందు చోటుచేసుకుంది. ఆ వీడియో లో ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇంటి బయటకి చేరుకొని ..నాకు ఆరోగ్యం బాగాలేదని , నా కొడుకుకి కూడా ఫీవర్ వస్తుంది అని , నాకు కరోనా పాజిటివ్ గా వచ్చింది అని డాక్టర్స్ చెప్పారని, అయినా కూడా బెడ్స్ ఖాళీ లేవని నాకు బెడ్ కేటాయించలేదు... దయచేసి మాకు సాయం చేయండి సీఎం గారు అంటూ గట్టిగ అరుస్తూ ఆందోళన చెప్పట్టాడు.
ఈ ఘటన పై సీఎం యడియూరప్ప సన్నిహితులను ప్రశ్నించగా.. వారు దాన్ని ఖండించారు. ఆ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లకుండా సరాసరి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు వచ్చాడని, వైద్యానికి డబ్బులు లేకపోవడంతోనే అతడు ఇలా చేశాడన్నారు. ఆ తరువాత అంబులెన్స్ లో ఆ కుటుంబాన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కర్ణాటకలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. కర్ణాటక లో ఇప్పటివరకు 50 వెలకై పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.