మహారాష్ట్రలో మహమ్మారి విలయతాండవం చేస్తోంది. వైరస్ పుట్టినిల్లు అయిన చైనాను కేసుల్లో అధిగమించి మహారాష్ట్ర దూసుకుపోతుండడం కలవరపెడుతోంది. ఆదివారం నమోదైన పాజిటివ్ కేసులతో.. చైనాను మహారాష్ట్ర అధిగమించింది.
భారతదేశంలోనే మహమ్మారికి హబ్ గా మహారాష్ట్ర మారింది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 3007 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 85975కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య ఏకంగా 3060కి చేరింది.
ప్రస్తుతం మహారాష్ట్రలో 43591 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదుకావడం గమనార్హం. ఆ తర్వాత థానే, ఫూణే నగరాల్లో నమోదవుతున్నాయి.
ఇప్పటికే కేసుల్లో మహారాష్ట్ర ఇటలీని అధిగమించి రికార్డ్ నమోదు చేసింది. ఇప్పుడు చైనాను అధిగమించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున నమోదవుతున్న కేసుల్లో ఐదో దేశంగా భారత్ ఉంది.