రాజమండ్రిలో కరోనా .. ఓ కళాశాలలో ఒకేరోజు 163 మందికి కరోనా!

Update: 2021-03-23 04:11 GMT
ఆంధ్ర ప్రదేశ్ ​లో కరోనా మళ్లీ తిరగదోడుతున్నది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో కరోనా కల్లోలం సృష్టించింది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా తన ఉధృతిని కొనసాగిస్తున్నది. మహారాష్ట్రలో కరోనా స్వైర విహారం చేస్తున్నది. నిన్న ఒక్కరోజే ఆ రాష్ట్రంలో దాదాపు 30 వేల కేసులు నమోదయ్యాయి. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్​ లోనూ కరోనా స్వైరవిహారం చేస్తున్నది. కొత్త కేసులు నమోదవుతుండటంతో ఆందోళన నెలకొన్నది.

రాజమండ్రి సమీపంలోని ఓ కళాశాలలో ఒకేరోజు 163 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు అలర్టయ్యారు. మరోవైపు సీఎం జగన్​ కూడా పెరుగుతున్న కేసులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై సమీక్షిస్తున్నారు. అయితే అన్ని కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 700 మంది విద్యార్థుల నమూనాలు సేకరించారు.

అంతేకాక రాజమండ్రిలోని ఓ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో రాష్ట్రంలో 310 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,94,044కి చేరింది. ఓ వైపు వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.

కరోనా సోకి గత 24 గంటల్లో ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లాలో ఒకరు, కృష్ణాలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 7191 మంది మృతిచెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 114 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,84,471కి చేరింది.

రాష్ట్రం లో ప్రస్తుతం 2382 యాక్టివ్ కేసులున్నాయి. అయితే కొత్త కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.  అనంతపురంలో 26, చిత్తూరులో 51, తూర్పు గోదావరి లో 43, గుంటూరు లో 28, కడప లో 20, కృష్ణా లో 26, కర్నూలు లో 21, నెల్లూరు లో 13, ప్రకాశం లో 12, శ్రీకాకుళం లో 20, విశాఖపట్నం లో 43, విజయనగరంలో 7 కొత్త కేసులు నమోదయ్యాయని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ కూడా ముమ్మరంగా సాగుతున్నది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వైద్యులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News