నిశ్చితార్థ వేడుక‌తో 15మందికి వైర‌స్‌.. వ‌రుడి తండ్రి మృతి

Update: 2020-05-20 11:50 GMT
మ‌హ‌మ్మారి వైరస్‌కు చిన్న అవ‌కాశం దొరికితే చాలు వేగంగా వ్యాపించేస్తోంది. ఒక‌రి ద్వారా ఒక‌రికి వ్యాప్తిస్తుంద‌ని తెలిసినా కూడా ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏమాత్రం భ‌యం, బెరుకు లేకుండా వేడుక‌లు చేసుకుంటూ ఆ వైర‌స్ వ్యాప్తికి స‌హ‌క‌రిస్తున్నారు. తెలంగాణ‌‌లో న‌మోద‌వుతున్న కేసుల్లో అత్య‌ధికంగా వివిధ శుభ‌కార్యాలు, బ‌ర్త్‌డేలు త‌దిత‌ర వాటితోనే ఆ వైర‌స్ వ్యాపిస్తోంది. ఒక‌రితో ప‌దుల సంఖ్య‌లో ఆ ‌మ‌హ‌మ్మ‌రి సోకుతోంది. తాజాగా ఇదే విష‌యాన్ని చెబుతోంది. మొన్న బ‌ర్త్ డే వేడుక‌తో కొన్ని కుటుంబాలు వైర‌స్ బారిన ప‌డ‌గా.. ఇప్పుడు ఒక నిశ్చితార్థం వేడుక 15 మందికి వైర‌స్ సోక‌డానికి కార‌ణ‌మైంది.

వాస్త‌వంగా మార్చి, ఏప్రిల్‌, మే నెల‌ల్లో శుభ‌కార్యాల‌కు అనువైన‌ది. పైగా మంచి రోజులు ఈ స‌మ‌యంలోనే ఉంటాయి. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌వేశించి ఉండ‌కుంటే వేలాది జంట‌లు ఒక్క‌ట‌య్యేవి. ఎన్నో వేడుక‌లు జ‌రిగేవి. ఆ వైర‌స్ వ్యాపించ‌కముందే కొన్ని పెళ్లిళ్లు నిశ్చ‌య‌మ‌య్యాయి. అన్ని సిద్ధం చేసుకుని కూర్చున్న స‌మ‌యంలో వైర‌స్ వ్యాపించి కొంప‌ముంచింది. కొంద‌రు దీర్ఘ‌కాలం పాటు వాయిదా వేసుకోగా మ‌రికొంద‌రు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వివాహాలు, నిశ్చితార్థ వేడుక‌లు చేసుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే ఏప్రిల్ 11వ తేదీన ఓ కుటుంబం నిశ్చితార్థ వేడుక 300 మంది స‌మ‌క్షంలో నిర్వ‌హించింది. అయితే ఆ కార్య‌క్ర‌మం ధూంధాంగా నిర్వ‌హించింది. అక్క‌డ జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డంతో ఆ వేడుక ద్వారా ఏకంగా 15 మంది వైరస్ సోకింది. వీరిలో ఒకరు మృతి చెందారు. ఆ మృతి చెందిన వ్య‌క్తి ఎవ‌రో కాదు స్వ‌యంగా పెళ్లి కొడుకు తండ్రి. ఈ సంఘటన హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని ధూల్‌పేటలో జ‌రిగింది.చూసింది. అధికారులు ఈ వేడుకకు హాజరైన వారి వివరాలను సేకరిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు వ్యతిరేకంగా నిశ్చితార్థం నిర్వహించిన వారిపై కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News