మహమ్మారి వైరస్ తెలంగాణ లో తీవ్రంగా ప్రబలుతోంది. రెండు రోజులుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. అయినా కేసులు నమోదు ఆగడం లేదు. తాజాగా సోమవారం 975 పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా ఆరుగురు మృతి చెందారు. కొద్ది రోజులుగా టెస్టులు సంఖ్య పెంచడంతో భారీగా నమూనాల పరిశీలన మిగిలాయి. పెద్ద సంఖ్యలో నమూనాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం టెస్టులు నిలిపివేసిన విషయం తెలిసిందే.
పాత నమూనాల ఫలితాలే సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో తాజాగా 975 కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటితో కలిపి తెలంగాణ లో ఇప్పటి వరకు మొత్తం కేసులు 15,394కి చేరాయి. తాజాగా 410 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 9,559. హైదరాబాద్ లో వైరస్ విజృంభణ తీవ్ర స్థాయి లోనే ఉంది.
ప్రభుత్వం దీనిపైనే దృష్టి సారించింది. హైదరాబాద్ లో వైరస్ వ్యాప్తి కట్టడి కి ఏం చర్యలు తీసుకోవాలో ముఖ్య మంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులతో రెండు రోజులుగా చర్చలు చేస్తున్నారు. రేపటి లోపు హైదరాబాద్ విషయమై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ లో సంపూర్ణ లాక్ డౌన్ విధించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.