తెలంగాణలో కొత్త కేసులు 1,676.. 10 మంది మృతి

Update: 2020-07-17 02:45 GMT
మహమ్మారి వైరస్ తెలంగాణలో తీవ్ర స్థాయిలోనే విజృంభిస్తోంది కేసులు ఎక్కడా తగ్గడం లేదు. కొద్ది రోజులుగా జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం 1,676 కేసులు నమోదవగా.. పది మంది మృత్యువాత పడ్డారు. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేస్తుండడంతో కేసులు భారీగా వస్తున్నాయి. ఒక్కరోజే 14,027 పరీక్షలు చేశారు. వీటితో కలిపి మొత్తం టెస్టులు 2,22,693 చేరాయి. తాజాగా 1,296 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జయ్యారు.

వీటితో కలిపి మొత్తం కేసులు 41,018కి చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 13,328. మొత్తం మృతుల సంఖ్య 396కి చేరింది. వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం నివారణ చర్యలపై సమాలోచనలు చేస్తోంది.

కొత్తగా హెల్త్ బులెటిన్
ప్రతిరోజు విడుదల చేసే హెల్త్ బులెటిన్ గురువారం కొత్తగా కనిపించింది. గతానికి భిన్నంగా వైరస్ స్థితి రాష్ట్రంలో ఎలా ఉందో తెలిపేలా ఉంది. సమగ్ర వివరాలు తెలుపుతూ నాలుగు పేజీల బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కేసుల పరిస్థితి.. బాధితుల వివరాలతో పాటు ఈసారి కొత్తగా రాష్ట్రంలో చేసిన టెస్టుల వివరాలు.. ఆస్పత్రుల్లో పరిస్థితి.. రాష్ట్రంలో ఎవరెవరికి టెస్టులు.. చికిత్స కు అనుమతి ఇచ్చారో ఆ వివరాలన్నింటినీ పొందుపర్చారు.
Tags:    

Similar News