తెలంగాణ రాజకీయాలు గత కొద్దిరోజులుగా హాట్ హాట్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కలకలం నుంచి మొదలైన ఈ మాటల యుద్ధం సచివాలయం కూల్చివేత సమయంలో మరింత ముదిరింది. ఇక కీలకమైన ఉస్మానియా ఆస్పత్రిలోకి వర్షపు నీరు చేరటంతో అధికార-ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతల మాటలకు ఈ దవాఖన అడ్డాగా మారింది. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్..బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆస్పత్రిలోకి వర్షపు నీరు చేరటం సర్కారు పని తీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. అయితే, ఈ సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆస్పత్రిని సందర్శించి విపక్షాలపై మండిపడ్డారు. అయితే, కాంగ్రెస్ నేత, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆయనకు ఓ రేంజ్‌లో షాక్ ఇచ్చారు.
తలసానికి తలా-తోక తెలియదని, నోరుందని అడ్డగోలుగా మాట్లాడొద్దని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రోశయ్య సీఎం గా ఉన్నప్పుడే ఉస్మానియా పక్కన భవన నిర్మాణం కోసం 200 కోట్లు మంజూరు చేశారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని కొనసాగించాలని తాము అన్నామని, అయితే కొత్త భవనం కడతామని టీఆర్ఎస్ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ఆరోగ్యమంత్రి మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారని భట్టి గుర్తు చేశారు. అయినప్పటికీ పనులు మొదలుపెట్టలేదని వ్యాఖ్యానించారు. తమపై విమర్శలు చేయడానికి బుద్ది, సిగ్గు ఉండాలని మండిపడ్డారు.
ఉస్మానియా ఆసుపత్రిలోకి ఎప్పుడూ రాని డ్రైనేజీ నీళ్లు..ఇప్పుడే ఎందుకు వచ్చాయని భట్టి విక్రమార్క ప్రశ్నించారు."తలసాని నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఆరోగ్య శాఖ సంగతి నీకు ఎందుకు ? గాడిద పెత్తనం కుక్క ఎత్తుకుంటే నడుములు ఇరిగాయన్నట్టు ఉంది నీ పద్ధతి" అని ఎద్దేవా చేశారు. ఉస్మానియాలోకి నీళ్లు ఎలా వచ్చాయో చూడాల్సిన మున్సిపల్ శాఖ మంత్రి ఎక్కడ? అంటూ మంత్రి కేటీఆర్‌ను నేరుగా భట్ టార్గెట్ చేశారు. మంత్రి తలసాని సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.