వారం క్రితం ముచ్చట.. తెలంగాణలో పెద్ద పల్లి జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. అతడి మృతదేహాన్ని శ్మశానికి తరలించడానికి మున్సిపల్ ట్రాక్టర్ ను ఆసుపత్రికి రప్పించారు. అయితే ఆ డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్లడానికి సదురు ట్రాక్టర్ డ్రైవర్ అంగీకరించలేదు. చాలా సేపటి వరకు ఆ శవాన్ని ఎవరూ తీయలేదు.
దీంతో ఈ దీనగాథను అర్థం చేసుకున్న కరోనా వైరస్ డిస్ట్రిక్ట్ సర్వీలెన్స్ అధికారి డాక్టర్ శ్రీరామ్ ముందుకొచ్చాడు. ఏకంగా ట్రాక్టర్ ను నడుపుకుంటూ శ్మశానానికి తరలించి శభాష్ అనిపించుకున్నాడు. పీపీఈ కిట్ వేసుకొని అంత్యక్రియలు నిర్వహించిన డాక్టర్ శ్రీరామ్ మానవతా దృక్ఫథానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు కురిశాయి.
దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. డాక్టర్ చేసిన పనికి అందరూ పొగిడారు. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఆ డాక్టర్ పై కన్నెర్ర చేయడం అందరినీ ముక్కున వేలేసుకుంటున్నారు.
తెలంగాణ సర్కార్ తాజాగా కరోనా శవాన్ని తీసుకెళ్లిన ట్రాక్టర్ నడిపిన డాక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శవాన్ని తరలించడంలో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఎందుకు పాటించలేదని.. డాక్టర్ అయ్యుండి శవాన్ని ఎందుకు తరలించారో వివరణ ఇవ్వాలని జిల్లా వైద్యశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
దీనికి మానవత్వంతోనే తాను ఇలా వ్యవహరించానని.. తనకు ఎటువంటి దురద్దేశాలు లేవని డాక్టర్ శ్రీరామ్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. కరోనా శవాన్ని చూసి ఎవరూ దగ్గరకు రాకుంటే ఎంతో గొప్పపని చేసిన డాక్టర్ శ్రీరామ్ ను అభినందించాల్సింది పోయి నోటీసులు జారీ చే్యడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ మీడియా సైతం పొగిడిన డాక్టర్ పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అందరూ నిప్పులు చెరుగుతున్నారు.