తెలంగాణ రాష్ట్రసర్కారుకు తెలంగాణ హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కరోనా ఎపిసోడ్ లో వైద్యులు.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. అలక్ష్యంతో పాటు.. అధికారుల తీరుతో పలు విషాద ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు పలు బయటకు రావటం తెలిసిందే. హైదరాబాద్ లోని చెస్ట్ ఆసుపత్రిలో తనకు ఆక్సిజన్ మాస్కు తొలగించారని.. ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉందని చెబుతూ రవికుమార్ అనే బాధితుడు వీడియో పెట్టటం.. అదికాస్తా వైరల్ గా మారటం తెలిసిందే.
వైద్యుల నిర్లక్ష్యంతోనే రవికుమార్ మరణించారంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ గురువారం సాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రభుత్వానికి ఎలాంటి తప్పు లేదన్నట్లుగా పేర్కొనటమే కాదు.. ప్రభుత్వ చర్యల్ని సమర్థించే ప్రయత్నం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం.. తనను ఎవరూ పట్టించుకోవటం లేదని.. తనకు పెట్టిన ఆక్సిజన్ మాస్కు తొలగించినట్లుగా వీడియో తీసి పంపారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
మీరు చెబుతున్న దాన్లో ఏది నిజం? ఈ వ్యవహరంలో వాస్తవాలు ఏమిటో తెలుసుకునేందుకు పోలీసు దర్యాప్తునకు ఆదేశించాలా? అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. రవికుమార్ గుండె సంబంధిత వ్యాధితో మరణించినట్లుగా చెప్పిన ప్రభుత్వ న్యాయవాది.. వైద్యం అందక మరణించారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం.. ఈ ఉదంతంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని తాము ఎలా భావించాలని ప్రశ్నించటమే కాదు.. కరోనా రోగికి అందించినచికిత్సలకు సంబంధించిన వివరాల్ని తమకు అందజేయాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది చెప్పినట్లుగా అంత బాగా పరీక్షలు చేస్తే.. దానికి సంబంధించిన నివేదికల్ని ఎందుకు ఇవ్వరని ప్రశ్నించటంతో తమకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో.. ఈ కేసు విచారణను ఆగస్టు 18కువాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.