సంక్షోభంలో తల్లడిల్లుతున్న వేళ.. వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసిన ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల ఆరాచకానికి చెక్ చెప్పేందుకు తెలంగాణ సర్కారు చర్యల కొరడాను ఝుళుపుతోంది. ఇంతకాలం ఎన్ని ఆరోపణలు.. ఫిర్యాదులు బయటకు వచ్చినా.. చూసిచూడనట్లుగా ఉన్న ప్రభుత్వం.. అంతకంతకూ హద్దులు దాటుతున్న ప్రైవేటు దవాఖానాలకు చెక్ పెట్టే చర్యలకు సిద్ధమైంది.
వరుసగా రెండు రోజులు రెండు ఆసుపత్రులపై చర్యలు తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్.. ఈ రోజు (బుధవారం) మరో ఆసుపత్రిపై చర్యలు తప్పవన్న మాట వినిపిస్తోంది. మొన్నటికి మొన్న సోమాజీగూడలోని దక్కన్ ఆసుపత్రిపై చర్యలు తీసుకున్న టీ సర్కారు.. మంగళవారం బంజారాహిల్స్ లోని విరంచి ఆసుపత్రితో చర్యలు చేపట్టింది. కరోనా చికిత్స కోసం ఆ ఆసుపత్రికి ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసింది.
కరోనా బాధితుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసినట్లుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆసుపత్రిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై.. ఆ ఆసుపత్రిలో కరోనా బాధితుల్ని చేర్చుకోవటానికి.. వారికి వైద్యం చేయటానికి వీల్లేదన్న స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. అయితే.. ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్న కరోనా పేషెంట్లకు మాత్రం వైద్యం అందించాలని పేర్కొంది.
ప్రైవేటు ఆసుపత్రుల ఆరాచకాల్ని తగ్గించుకోకపోతే.. వారికి ఇచ్చిన ఆసుపత్రి అనుమతుల్ని కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ రోజు (బుధవారం) కూడా ఒక ప్రైవేటు ఆసుపత్రిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల విషయంలో కఠినంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కఠినంగా వ్యవహరిస్తున్న టీ సర్కారు తీరుతోనైనా ఆసుపత్రుల వ్యవహారశైలి మారుతుందేమో చూడాలి.