కరోనా ఎపిసోడ్ లో మొదటి బంతికే సిక్సర్ కొట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తర్వాత మాత్రం తన పేలవమైన పనితీరుతో పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకున్నారు. అందరూ నిర్దారణ పరీక్షల్ని భారీగా చేయిస్తే.. తెలంగాణ సీఎం మాత్రం ఆ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించటం లేదన్న విమర్శను ఎదుర్కొన్నారు. అంతేకాదు.. రోజువారీగా విడుదల చేసే నివేదిక విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు చేత పలుమార్లు ఆక్షింతలు వేయించుకోవాల్సి వచ్చింది.
ఒకటికి నాలుగుసార్లు రోజువారీ రిపోర్టు మీద విమర్శలు చేసిన తర్వాత కానీ వైద్యాధికార శాఖ తన తీరును మార్చుకొని.. పాజిటివ్ కేసుల వివరాలతో పాటు.. ఎన్ని పరీక్షలు చేశారు? రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదవుతున్న కేసులు.. వయసుల వారీగా ఎంత? ఇలాంటి డీటైల్డ్ సమాచారాన్ని వెల్లడించింది. పక్కనున్న ఏపీలో పెద్ద ఎత్తున కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్న మాట పలువురి నోటి నుంచి వస్తున్నా పట్టించుకోని పరిస్థితి.
తాజాగా ఇదే అంశంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. రోజూ యాభైవేల పరీక్షలు.. వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాల్ని అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే తమ ఆదేశాల్ని అమలు చేయలేదని.. ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
తమ ఆదేశాల మీద అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చు కానీ.. లెక్క లేనట్లుగా వ్యవహరిస్తానంటే మాత్రం ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చింది. రోజుకు 50వేల నిర్దారణ పరీక్షలు చేయాలని ఈ నెల 19 నుంచి తాము ఆదేశించినా ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. వారంలో రోజుకు 40వేల నుంచి 42 వేల వరకు మాత్రమే పరీక్షలు చేయటాన్ని తప్పు పట్టింది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో చేస్తున్న పరీక్షల వివరాల్ని ప్రస్తావించింది.
పక్కనున్న ఏపీలో ప్రతి పదిలక్షల జనాభాకు 1.85లక్షల మందికి పరీక్షలు చేస్తుండగా.. ఢిల్లీలో అత్యధికంగా 2.95లక్షలు.. కేరళలో 1.67లక్షల పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం 1.39 లక్షల పరీక్షలే చేయటాన్ని ప్రస్తావించింది. ఇతర రాష్ట్రాలతోపోలిస్తే తెలంగాణలో పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉందని.. రోజు 50వేలకు తగ్గకుండా పరీక్షలు చేయాలని పేర్కొంది. పరీక్షల నిర్దారణ విషయంలో ల్యాబ్ ల సంఖ్య పెంచుతామని రెండు నెలల క్రితం తమకు హామీ ఇచ్చారని.. ఇప్పటివరకు ఒక్క ల్యాబ్ ను మాత్రమే పెంచిన విషయాన్ని హైకోర్టుప్రస్తావించింది. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అయినా.. తెలంగాణ ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచుతుందో లేదో చూడాలి.