తెలంగాణలో 593 కేసులు.. గ్రేటర్ లో మరింత తక్కువ.. కానీ అలా జరుగుతుందే?

Update: 2020-11-30 07:15 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్  విరుచుకుపడుతూ.. అమెరికాతో పాటు యూరప్ లోని పలు దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు.. చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఫస్ట్ వేవ్ ఎండింగ్ లో ఉన్న చోట్ల కేసులు తక్కువగా నమోదు అవుతుంటే.. సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన చోట్ల మాత్రం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే.. కరోనాకేసులు అంతకంతకూ తగ్గతున్నట్లుగా ప్రభుత్వం విడుదల చేస్తున్న నివేదికలు స్పష్టం చేస్తున్నారు.

ఆదివారం రాత్రి 8 గంటల వరకు నమోదైన కరోనాకేసులు కేవలం 593 మాత్రమే. ఇటీవల కాలంలో ఇంత తక్కువ కేసులు నమోదైంది ఇప్పుడే. వెయ్యికి తగ్గకుండా కేసులు నమోదవుతున్న వేళ.. గడిచిన కొద్ది రోజులుగా మూడు అంకెల్లోకి పాజిటివ్ కేసులు వచ్చేశాయి. గ్రేటర్ లో కేసుల నమోదు మరింత తగ్గిపోయింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం కేవలం 119 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

మేడ్చల్ జిల్లాలో 55.. రంగారెడ్డి జిల్లాలో 61 కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఇదిలా ఉంటే.. ఓవైపు కేసులు తగ్గుతున్నట్లు నివేదికలు చెబుతుంటే.. మరోవైపు.. తెలిసిన వారు పలువురు పాజిటివ్ బారిన పడుతున్న సమాచారం ఈ మధ్యన ఎక్కువగా అందుతోందని.. ఈ వైరుధ్యం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

 ఈ విషయం మీద ప్రభుత్వం మరింత  శ్రద్ధ చూపాలని కోరుతున్నారు. తక్కువగా కేసులు నమోదు కావటం మంచిదే. కాకుంటే.. సమాచార లోపంతో తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళితే.. వారిలో నిర్లక్ష్యం పెరిగే వీలుందన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News