బ్రిటన్ ​లో కరోనా కొత్తరూపంలో విజృంభణ.. దేశాన్ని వదిలివెళ్తున్న ప్రజలు..

Update: 2020-12-21 07:15 GMT
బ్రిటన్​లో కరోనా వైరస్​ కొత్తరూపంలో విజృంభించింది. సాధారణ వైరస్​ కంటే ఎంతో బలోపేతం అయ్యింది. ఈ మ్యుటేషన్​ కరోనా వైరస్​ బ్రిటన్​లో ఇప్పడిప్పుడే విజృంభిస్తున్నది. దీంతో అక్కడి ప్రభుత్వం సంపూర్ణ లాక్​డౌన్​ విధించింది. విదేశీ ప్రయాణాలను నిషేధించింది. మరో వైపు చాలా దేశాలు బ్రిటన్​ నుంచి రాకపోకలు నిలిపివేశాయి. అయితే లండన్​లో ఉంటున్న విదేశాలవల్ల మాత్రం వీలైనంత త్వరగా దేశం విడిచిపోవాలని చూస్తున్నారు. దీంతో ప్రస్తుతం లండన్ లోని హీత్రో విమానాశ్రయం వేలమంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

డబ్లిన్, ఐర్లాండ్ కు వెళ్ళీ చివరి విమానం ఎక్కేందుకు కిక్కిరిసిపోయింది. మరోవైపు యూకే నుంచి వచ్ఛే అన్ని విమానాలను ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, ఎల్ సాల్వడార్,  బల్గెరియా,  ఆస్ట్రియా, ఐర్లాండ్ వంటి దేశాలు లండన్​ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. బ్రిటన్​ - ఫ్రాన్స్​ సరిహద్దులను ఇప్పటికే మూసివేశారు. మరోవైపు బ్రిటన్​ నుంచి వచ్చే అన్ని లారీలను, ట్రక్కులను ఫ్రాన్స్​ మూసేసింది. అయితే బ్రిటన్​లోని పలు నగరాల్లో ఇప్పటికే లాక్​డౌన్​ విధించారు.

ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. క్రిస్మస్​ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్న ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే అమెరికా మాత్రం ఇంకా బ్రిటన్​ విమానాలపై బ్యాన్​ విధించలేదు. బ్రిటన్​లో కొత్త తరహా వైరస్​ రావడంతో యూరప్​ దేశాలు బిక్కుబిక్కు మంటున్నాయి. ఈ వైరస్​ తమ దేశాలకు అంటుకుంటుందేమోనని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. కరోనా రూపం మార్చుకొని బ్రిటన్​లో విజృంభిస్తున్నది. గతంలో ఓ సారి కరోనా వచ్చినవాళ్లకు సైతం ఈ కొత్తతరహా వైరస్​ వ్యాపిస్తున్నది. ఇప్పటికైతే ఈ వైరస్​ బ్రిటన్​కే పరిమితమైంది. అయితే ఇతర దేశాలకు కూడా పాకే పరిస్థితి ఉందని వైద్యులు అంటున్నారు. ఈ వైరస్​పై ఇంకా డబ్ల్యూహెచ్​వో స్పందించలేదు.
Tags:    

Similar News