ప్రస్తుతం దేశంలో ఈ వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కాగా, కాన్పూర్ ప్రభుత్వ హాస్టల్ లో 57 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిన అంశం దేశాన్ని కుదిపేస్తోంది. 57 మందికి వైరస్ పాజిటివ్ అని రాగా ఇందులో ఐదుగురు గర్భం దాల్చారు. వైరస్ నెగిటివ్ వచ్చిన మరో ఇద్దరు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది. ఈ వార్త దేశవ్యాప్తంగా వైరల్ అవ్వడంతో దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు జారీచేసింది. ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.
ఈ ఘటనను ఎన్ హెచ్ ఆర్సీ సుమోటోగా తీసుకుంది. మీడియా కథనాల ఆధారంగా స్పందిస్తూ.. కాన్పూర్ ఘటన నిజమైతే సదరు విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. జీవించే హక్కు, స్వేచ్చను అక్కడి ప్రభుత్వం హరించింది అని తీవ్రంగా కామెంట్ చేసింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, అందిస్తోన్న వైద్య చికిత్సపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. యూపీ డీజీపీకి కూడా నోటీసులు జారీచేసింది. ఘటనకు సంబంధించి ఎఫ్ ఐ ఆర్ కాపీ, విచారణకు సంబంధించి నివేదిక అందజేయాలని కోరింది.
ఎన్ హెచ్ ఆర్సీ తోపాటు ఉత్తరప్రదేశ్ మహిళ కమిషన్ కూడా ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని కాన్పూర్ జిల్లా కలెక్టర్‌ను కోరింది. కాన్పూర్ షెల్టర్ హోం ఘటన దుమారం రేపడంతో.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రంలోని అన్ని మహిళ షెల్టర్ హోమ్స్, జువైనల్ హోం వద్ద కరోనా వైరస్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఈ మేరకు సీఎస్ రాజేంద్ర కుమార్ ఆదేశాలు జారీచేశారు.
షెల్టర్ హోంలలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని అడిషనల్ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్పేర్ అండ్ ఉమన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్లకు ఆదేశాలు జారీచేశామని తెలిపారు. అంతేకాదు సంబంధిత వసతి గృహలకు సంబంధించిన నిర్వాహకులు సమీపంలోనే ఉండాలని స్పష్టంచేశారు. యూపీ ప్రభుత్వ తీరును కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ విమర్శలు కురిపించారు. ముజఫర్ నగర్, డియోరియా ఘటనలు జరగకముందే మరో ఘటన జరిగిందని గుర్తుచేశారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత విచారణ పేరుతో జాప్యం జరుగుతుంటే తప్ప.. మరో ఘటన జరగకుండా నివారించడం లేదన్నారు.