రాజకీయాలు మునుపటిలా లేవు. అంటే ట్రెడిషనల్ స్టైల్ ని అవి ఏనాడో దాటిపోయాయి. వాటి రూపూ షేపూ కూడా చాలా మారిపోయింది. మరో వైపు దానికి కారణం పార్టీలూ నాయకులలో వచ్చిన భారీ మార్పులు. దానికి తోడు టెక్నికల్ గా వచ్చిన మార్పులు కూడా టోటల్ చేంజికి అవకాశం ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ నాయకుడిగా కన్నా చంద్రబాబు సీఎం అయ్యాక మరింత రాటుదేలారు, తనదైన మార్క్ చూపిస్తూ ఆయన చాణక్యుడు అనిపించుకున్నారు. ఇపుడు జగన్ సైతం అలాగే సాగుతున్నారు అంటున్నారు.
జగన్ గత పదేళ్ల రాజకీయం కంటే కూడా సీఎం అయ్యాకనే బాగా దూకుడు చేస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. పవర్ లో ఉన్న వారికి అన్ని రకాలుగా కలసి వస్తుంది. దాంతో వారు తలచుకుంటే దేన్ని అయినా తమకు అనువుగా మార్చేసుకోగలరు. అయితే ఏ టెక్నిక్ కూడా అన్ని సార్లూ అన్ని వేళల్లో హిట్ అవదు, అయితే అయినంత కాలం మాత్రం ఎదురులేకుండానే ఉంటుంది.
ఇక ఏపీలో చూసుకుంటే జగన్ విపక్షాలను ఏమార్చడానికి జనాలను మార్చడానికి నమ్ముకున్నది డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు. ఏ ఇష్యూ కూడా జనాల మనో ఫలకాల మీద గట్టిగా ముద్ర పడకుండానే దాన్ని మించిన మరో ఇష్యూని తెర మీదకు తెస్తున్నారా అన్న డౌట్లు అయితే అందరిలో ఉన్నాయి. అలా చూసుకుంటే సీరియస్ ఇష్యూస్ అన్నీ కూడా ఒక్కోటీ సైడ్ అయిపోతున్నాయి. వాటి ప్లేస్ లో కొత్త సమస్యలు వచ్చి చేరుతున్నాయి.
గత డిసెంబర్ లో అమరావతి రాజధాని ఇష్యూ పెద్ద సమస్య అయింది. ఆ టైమ్ లో దాని నుంచి జనాలను మళ్ళించడానికి ప్రభుత్వ పెద్దలు చాలానే చేశారని అంటారు. ఆ టైమ్ లో ముందుకు వచ్చిందే సినిమా టికెట్ రేట్ల తగ్గింపు ఇష్యూ. ఒక్కసారిగా నాడు చర్చ అంతా ఆ వైపుగా సాగిపోయింది. ఏపీలో హీరోల భారీ పారితోషికాలు, వారు ఏపీకి ఏమిస్తున్నారు, ప్రభుత్వం వారి విషయంలో తీస్తుకున్నది రైటా రాంగా అన్న టాపిక్ మీద అన్ని మీడియాలలో డిబేట్లు రోజుల తరబడి నడిచాయి.
చివరికి ఆ ఇష్యూ ఒక దశలో చేయి దాటేసి యావత్తు టాలీవుడ్ కూడా వైసీపీకి యాంటీ అవుతుంది అన్న అంచనాలు రాగానే మరో ఇష్యూ ఆ ప్లేస్ లోకి వచ్చేసింది అంటారు. అదే పీయార్సీ. అప్పటికే రెండేళ్ళుగా ఉద్యోగులు పీయార్సీ ఇవ్వాలని ఉద్యమిస్తున్నారు. దాంతో వాళ్ళను పిలిచి మరీ చర్చలు వరసబెట్టి జరిపారు. మొత్తానికి ఏం ఒప్పందం కుదిరిందో తెలియదు కానీ ప్రభుత్వం వైపు నుంచి అంతా ఓకే అనేసుకుని అర్ధరాత్రి జీవోలు ఇచ్చేశారు. ఇపుడు అది కార్చిచ్చుగా మారి ఉద్యోగులు సమ్మె బాట పట్టేశారు.
దాంతో ఇపుడు జనాలతో పాటు మీడియా డిబేట్స్ అన్నీ కూడా ఆ వైపుగానే సాగుతున్నాయి. ఇవాళ కాకపోయినా రేపు అయినా సమ్మె తెగ జనాలకు గట్టిగానే తగిలే అవకాశం ఉంది. దాంతో మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ అన్నట్లుగా ఇపుడు కొత్త జిల్లాల అంశాన్ని తెర మీదకు తెచ్చాని అంటున్నారు.
కొత్త జిల్లాలు అంటే తేనే తుట్టె కదపడమే, చాలా చోట్ల ఏకాభిప్రాయం లేదు. ఏ ప్రాంతాన్ని ఏ జిల్లాలో కలపాలి అన్న దాని మీద ఇప్పటికే అధికార విపక్ష రాజకీయం జోరుగా సాగుతోంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలు తమ జిల్లా కాకుండా పోతే మిగిలిన వారు గోల పెడతారు. ఒక విధంగా ఇది సాఫీగా సవ్యంగా తేలుతుందా అన్నది అయితే డౌటే. మరి ఇపుడు దీన్ని కదపడం ద్వారా ఏపీలో అటు విపక్షాలు ఇటు జనాల దృష్టిని ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నుంచి డైవర్ట్ చేసేందుకే అన్న మాట వినిపిస్తోంది.
మొత్తానికి కొత్త జిల్లాల మీద ప్రకటన తరువాత పరిణామాలు ఎలా విధంగా కొత్త రూపు సంతరించుకుంటాయో చూడాల్సిందే. అయితే ఇక్కడ ఒక మాట. డైవర్షన్ చేయడానికి ఒక ఇష్యూ నుంచి మరో ఇష్యూ మీదకు వెళ్ళడం వరకూ బాగానే ఉన్నా ఒక దశలో ఇవన్నీ పెను సమస్యగా మారి అతి పెద్ద సవాల్ నే ముందు పెడితే మాత్రం అది కాస్తా డేంజరస్ గేమ్ గా మారినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మరి ప్రస్తుతానికి అయితే ఇది బాగుందనే అలా సాగుతున్నారనుకోవాలి.