డార్జిలింగ్ లో ప్రత్యేక గూర్ఖాలాండ్ కోసం కొద్దిరోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తేయాకును తెంపే కూలీలు పనిలోకి రాకుండా ఆందోళన చేపట్టడంతో స్థానిక టీ కంపెనీలన్నీ మూతపడ్డాయి. ఈ ఆందోళనల ప్రభావంతో కొద్ది రోజులుగా డార్జిలింగ్ నుంచి తేయాకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో, అంతర్జాతీయ మార్కెట్ లో తేయాకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ప్రపంచంలోనే డార్జిలింగ్ తేయాకుకు ప్రత్యేక డిమాండ్ ఉంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో ఈ తేయాకుకు గిరాకీ ఎక్కువ. ఆందోళనల నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో, అంతర్జాతీయ మార్కెట్ లో ఒక కిలో డార్జిలింగ్ టీ పొడి ధర... లక్ష ఇరవై వేల రూపాయలు పలుకుతోంది. గతంలో కిలో తేయాకు ధర రూ.5000 గా ఉండేది. త్వరలోనే అసలు సరుకు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని తేయాకు ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డార్జిలింగ్ లో పండే తేయాకు అస్సాం తేయాకుకన్నా ప్రత్యేకమైనది, భిన్నమైనది. దీనికి ప్రత్యేకమైన రుచి, వాసన ఉంటుంది. అందుకనే అస్సాం టీ పొడి కిలో 130 రూపాయలు పలికితే డార్జిలింగ్ టీ పొడి ధర ఐదువేల రూపాయల వరకు పలుకుతుంది. డార్జిలింగ్ తేయాకు పంటను మేలో ప్రారంభిస్తారు. అదే జూన్ నెలలో తీవ్రస్థాయికి చేరుకుంటంది. సెప్టెంబర్‌తో పూర్తిగా ముగిసిపోతుంది. ఆకులను తెంపి వేయడం వల్ల మళ్లీ వచ్చే ఆకులు బలంగా ఉంటాయి.
జూన్ నెలలో తేయాకు ఆకులను తెంపడం ఆపిస్తే ఆ తర్వాత ఆకులు కూడా చేతికి అందకుండా పోతాయి. కీలకమైన జూన్ నెలలో తేయాకు కార్మికులు పనిలోకి రావడం లేదు. ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ గూర్ఖాలు జూన్ 9వ తేదీ నుంచి తేయాకు తోటల్లోకి పనులకు రావడం లేదు.
డార్జిలింగ్ తేయాకు రెండో పంట దాదాపు పూర్తిగా తుడుచుపెట్లుకుపోయినట్లేనని స్థానిక ‘గూడ్‌రిక్ గ్రూప్’ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎన్ సింగ్ తెలిపారు.
దాదాపు ఆ కంపెనీకి 260 కోట్ల రూపాయల నష్టం ఇప్పటికే వాటిల్లిందట. ఆ ప్రాంతంలో దాదాపు వంద మంది ఎగుమతిదారులకు ఈ సంఘం ప్రాతినిధ్యం వహిస్తోంది. జర్మనీకి చెందిన హల్‌స్సేన్ అండ్ ఆంప్ - లియాన్ - లండన్ కు చెందిన యూనిలివర్ - యూకేకు చెందిన టైపూ - ట్వినింగ్స్ - టెట్లీ కంపెనీలు డార్జిలింగ్ టీ పొడిని ఎక్కువగా కొనుగోలు చేస్తాయి.