బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసులో అత్యంత కీలక పరిణామం!

ఇందులో భాగంగా... అతుల్ భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-12-15 05:15 GMT

దేశవ్యాప్తంగా అత్యంత సంచలనంగా మారిన బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ముందు అతుల్ రాసిన సుమారు 40 పేజీల లేఖతో పాటు 80 నిమిషాల వీడియో కూడా సంచలనంగా మారింది. ఇదే సమయంలో న్యాయమూర్తి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... అతుల్ భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నికితను గురుగ్రాంలో అరెస్ట్ చేయగా.. ఆమె తల్ల్లి, సోదరుడిని ప్రయాగ్ రాజ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో... వీరిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోపక్క నికితా సింఘానియా, నిషా సింఘానియా, అనురాగ్ సింఘానియాల తరుపున అలహాబాద్ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు దాఖలైంది!

కాగా... బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ అత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన ఆత్మహత్యకు తన భార్య, ఆమె కుటుంబ వేధింపులు అని పేర్కొంటూ.. తనకు మరణం తర్వాత అయినా న్యాయం జరగాలని అతుల్ రాసిన సూసైడ్ నోట్ సంచలనంగా మారింది!

భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి రాసిన లేఖను ఇ-మెయిల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటంబ సభ్యులకు పంపించారు.

మరోపక్క అతుల్ కు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా కాంపెయిన్ ప్రారంభమైందని అంటున్నారు. ఈ సందర్భంగా సూసైడ్ నోట్ లో అతుల్ లేవనెత్తిన అంశాలు లీగల్ సొసైటీలోనూ తీవ్ర చర్చకు దారీతీశాయని అంటున్నారు.

Tags:    

Similar News