ఈ నెల రెండు.. మూడు వారాల్లో ఒకసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వనున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. అనూహ్యంగా అంచనాలకు మించిన వేగంతో ఈ నెల ఆరున అంటే మంగళవారం ప్రధానితో భేటీకి ముహుర్తాన్ని డిసైడ్ చేశారు. పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైనట్లుగా చెబుతున్నారు.
ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా తో రెండు దఫాలు భేటీ కావటం.. ఏపీ సర్కారు ఏం కోరుకుంటుందన్న సందేశాన్ని స్పష్టం చేసిన జగన్ ఎజెండాపై మోడీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకొని ఉంటారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే జగన్ కు మోడీ అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు.
తాజా భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే వీలు ఉందంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న పలు పంచాయితీలకు సంబంధించి అపెక్సు కమిటీలో చర్చకు రానున్న వేళలోనే.. ప్రధాని మోడీని సీఎం జగన్ కలవటాన్ని పలువురు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏపీతో నెలకొన్న జల పంచాయితీల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యాఖ్యానించటం తెలిసిందే. సరిగ్గా అపెక్స్ సమావేశం రోజునే ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ కావటం చూస్తే.. ఏదో జరిగిందన్న మాట వినిపిస్తోంది.
ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేతకు ఆయన కుమారుడికి చెక్ పెట్టే ఫైల్స్ ను జగన్ సర్కారు సిద్ధం చేసిందని..అందుకు అవసరమైన కేంద్రం సాయాన్ని అందించాలని జగన్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు చంద్రుళ్ల లక్ష్యంగా తాజా భేటీ ఉంటుందని చెబుతున్నారు. జాతీయస్థాయిలో మోడీకి ప్రత్యామ్నాయంగా పావులు కదపాలని కేసీఆర్ కోరుకుంటున్నారు.
ఇందులో భాగంగానే జల వివాదాల్ని ఈ మధ్యన అదే పనిగా హైలెట్ చేస్తున్నారు. కేంద్రాన్ని తప్పు పట్టే అవకాశం ఏ మాత్రం లభించినా విడిచిపెట్టటం లేదు. ఈ తీరును మోడీషాలు తీవ్రంగా పరిగణించినట్లుగా సమాచారం. అందుకే జగన్ భేటీతో పలు అంశాలు క్లారిటీ రావటంతో పాటు.. కేసీఆర్ తీరును తప్పు పట్టే అంశాల్ని కూడా చర్చిస్తారని చెబుతున్నారు. సీఎం జగన్ ఎజెండాలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులపైనా తాజా భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కవన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.