ఆస్పత్రి బెడ్​ పైనే తల్లికి కన్నీటి వీడ్కోలు చెప్పిన కూతురు..!

Update: 2021-01-05 06:30 GMT
తల్లీ కూతుర్లు ఇద్దరికి కోవిడ్​ సోకింది. ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది. వాళ్లిద్దరికీ కృత్రిమశ్వాస అందిస్తున్నారు. అయితే తల్లికి పరిస్థితి మరింత విషమించింది. ఆమె మరికొద్ది గంటల్లోనే చనిపోతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ కూతురుకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె కూడా ఆక్సిజన్​ తీసుకుంటూనే ఉంది. తల్లితో మాట్లాడాలంటే కూడా శ్వాస అందడం లేదు. చివరకు తన తల్లి చేతిలో చెయ్యి వేసి ఆమె చివరి క్షణాలను పంచుకున్నది. ఇంతటి ఉద్విగ్న ఘటన ప్రపంచంలోనే ఇదే తొలిసారేమో. కన్నతల్లి మరికొద్ది గంటల్లోనే చనిపోతుందని తెలిసి.. ఆ తల్లి కూడా తన పక్క బెడ్​మీదే ఉండటం.. తాను కనీసం మాట్లాడలేకపోవడంతో ఆ కూతురు ఎంతటి మానసికక్షోభ అనుభవించిందో వర్ణణాతీతం.

అనాబెల్ శర్మ (49), మారియా రికో (76) కొవిడ్ తో బాధపడుతూ అక్టోబర్ లో ఆస్పత్రిలో చేరారు. వాళ్లకు ఆక్సిజన్​ అందకపోవడంతో ఐసీయూ వార్డుకు షిఫ్ట్ చేశారు. అక్కడే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న కూతురికి తెలిసింది ఆమె తల్లి ఇంకొన్ని రోజులు మాత్రమే బతకగలదని.. దీంతో ఆ కూతురు తన తల్లి పక్కకు తన బెడ్​ను మార్చుకున్నది. తన తల్లి  చనిపోతుందని తెలిసి ఆమెకు ఏడ్చే ఓపిక కూడా లేదు. ఆమెకు కన్నీరు వచ్చిన వాటిని తుడ్చుకొనే శక్తి లేదు. అనాబెల్​ తన చివరిక్షణాలు ఎలా గడిపిందో ఇటీవల తెలిపింది.

‘నవంబర్​ 1న నా తల్లి చనిపోయింది అయితే ఆమె చనిపోతుందని నాకు కొన్నిగంటల ముందే తెలుసు. నా తల్లి చనిపోతుందని నాకు డాక్టర్లు చెప్పారు. నేను మాట్లాడే పరిస్థితిలో కూడా లేను. డాక్టర్లు చెప్పేది వినిపిస్తుంది అంతే. నా తల్లికూడా నాతో మాట్లాడలేకపోయింది. ఆ టైంలో మేమిద్దం మౌనభాషలో మాట్లాడుకున్నాం. మనసుతో, హావభావాలతో మా భావాలను వ్యక్తికరించుకున్నాం. ఇది నా జీవితంలో అత్యంత ఉద్విగ్నభరిత ఘటన.’ అని అనాబెల్ శర్మ పేర్కొన్నారు.
Tags:    

Similar News