1993లో ముంబై పేలుళ్ల సూత్రధారి, కరుడుగట్టిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను టెర్రరిస్టుగా గుర్తించడానికి ఇన్నాళ్లు ఒప్పుకోని దాయాది దేశం పాకిస్తాన్ తాజాగా తీవ్రవాదుల జాబితాను విడుదల చేసింది. అందులో అండర్ వరల్డ్ డాన్ దావూడ్ ఇబ్రహీంను ఆ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది.
ఈ లిస్టులో హఫీజ్ సయిద్, మహమ్మద్ అజర్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. అలాగే 88మంది రాజకీయ నాయకులు ఉన్నారు. పాకిస్తాన్ లో వీరందరిపై ఆంక్షలు ఉండనున్నాయి. వీరి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయనున్నారు.
ఇక దావూద్ కరాచీలోనే ఉన్నట్టుగా కూడా పాకిస్తాన్ అంగీకరించింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లకు పాకిస్తాన్ ఈ జాబితాను రిలీజ్ చేసింది. దావూద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది.