దావూద్ అదిరేలా సుప్రీం షాక్!

Update: 2018-04-20 10:34 GMT
ఒక దేశ యంత్రాంగం మొత్తం ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఒక డాన్ కోసం ప్ర‌య‌త్నం చేస్తే.. ప‌ట్టుబ‌డ‌కుండా త‌ప్పించుకు తిర‌గ‌టం ఒక్క భార‌త్ లోనే సాధ్య‌మ‌వుతుందేమో? అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంను ప‌ట్టుకునేందుకు కొన్నేళ్లుగా ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నించినా.. అత‌గాడు కొరుకుడుప‌డ‌టం లేదు. అంత మొన‌గాడు.. ఇంత మొన‌గాడంటూ చెప్పుకునే మోడీ ప్ర‌ధాని అయిన వెంట‌నే విదేశాల నుంచి ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం.. దావూద్ లాంటోళ్ల ఆట క‌ట్ అంటూ చాలానే చెప్పారు. కానీ.. అవేమీ ఇప్ప‌టివ‌ర‌కూ మెటీరియ‌లైజ్ కాని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. దావూద్ కు దిమ్మ తిరిగే షాక్ ఒక‌టి తాజాగా త‌గిలింది. దావూద్ బంధువుల నుంచి ఆస్తుల‌ను  స్వాధీన‌ప‌ర్చుకోవాలంటూ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు తాజాగా భార‌త ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆస్తులు త‌మ‌వేనంటూ దావూద్ త‌ల్లి అమీనా వేసిన పిటిష‌న్ ను కోర్టు కొట్టేసింది.

దేశ ఆర్థిక రాజ‌ధానిగా అభివ‌ర్ణించే ముంబ‌యి మ‌హాన‌గ‌రంలో దావూద్ కు బెలెడ‌న్ని ఆస్తులు ఉన్నాయి. వాటిని దావూద్ త‌ల్లి.. సోద‌రి స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే స్మ‌గ్ల‌ర్ల స్వాధీన చ‌ట్టం ప్ర‌కారం 1998లో భార‌త ప్ర‌భుత్వం.. దావూద్ సంబంధీకులు.. వారి స‌న్నిహితుల ఆస్తుల్ని సీజ్ చేసింది.

దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన దావూద్ త‌ల్లి కోర్టును ఆశ్ర‌యించింది. తాజాగా తీర్పు ఇచ్చిన న్యాయ‌స్థానం.. వీరి పిటిష‌న్ ను కొట్టివేసింది. తమ ఆధీనంలో ఉన్న ఆస్తుల‌కు తామవేన‌ని.. స్వార్జిత‌మ‌న్న ఆధారాల్ని చూపించ‌లేక‌పోయారు. దీంతో ఈ ఆస్తుల్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ కోర్టు సూచించింది. ఆస్తుల‌కు సంబంధించి పిటిష‌న్ దాఖ‌లు చేసిన ఇద్ద‌రు మ‌ర‌ణించ‌టంతో ఆస్తుల స్వాధీనానికి లైన్ క్లియ‌ర్ అయ్యింది. ముంబ‌యి పేలుళ్ల అనంత‌రం దేశం విడిచి పారిపోయిన దావూద్‌ ను ఐక్య‌రాజ్య‌సమితి సెక్యురిటీ కౌన్సిల్ అంత‌ర్జాతీయ తీవ్ర‌వాదిగా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం దావూద్ పాక్ లో ఆశ్ర‌యం పొందారు. దావూద్ మాస్ట‌ర్ మైండ్ తో వేసిన బాంబుపేలుళ్ల కార‌ణంగా 257 మంది మ‌ర‌ణించారు.  

Tags:    

Similar News