ఎంత ఓడిపోతే మాత్రం అంతలేసి మాటలేంది?

Update: 2016-05-19 18:13 GMT
రాజకీయాల్లో గెలుపోటములు తట్టుకోవటం చాలా కష్టం. అందులోకి పవర్ రుచి చూశాక.. దాన్ని ఓ రేంజ్లో రుచి చూసిన తర్వాత అది దూరమైతే మా గొప్ప ఇబ్బందిగా ఉంటుంది. ఐదేళ్లకు తమ చేతిలో ఉన్న పవర్ తో చెలరేగిపోయిన కరుణానిధి బ్యాచ్ కు.. 2011లో జరిగిన ఎన్నికలు ఒక షాక్ అయితే.. తాజా ఎన్నికలు అంతకు మించిన షాక్ ను ఇచ్చాయని చెప్పక తప్పదు. ఎగ్జిట్ పోల్స్ సైతం డీఎంకేకు పవర్ పక్కా అని డిసైడ్ చేసి.. గెలుపు ధీమా వచ్చిన తర్వాత ఎదురయ్యే ఓటమితో వచ్చే బాధ అంతా ఇంతా కాదు. ఈ పరాజయం షాక్ కరుణానిధి వారసుల మీద ఎంత ఉందన్నది తాజాగా దయానిధి మారన్ మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది.

కేంద్రమంత్రిగా ఒక వెలుగు వెలిగి.. అవినీతి కుంభకోణాలతో మసకబారిన అతగాడికి.. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉంటుందన్న కఠిన నిజం అతని నోట మాటను జారేలా చేసింది. సంయమనంతో ఉండాల్సిన వేళ.. తొందరపాటుతో మాట్లాడిన మాటతో ఉన్న కాస్త పరువు కూడా పోయిన దుస్థితి. ఎగ్జిట్ పోల్స్ లో డీఎంకే విజయం ఖాయమని ప్రకటించిన వెంటనే అమ్మ పార్టీ ఓటర్లకు భారీగా డబ్బులు పంచేసిందంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేశారు.

అలా ఎలా అంటే.. ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యేది పోలింగ్ ముగిసిన తర్వాతే. ఆ చిన్న విషయాన్ని మర్చిపోయి.. జనాలు పిచ్చోళ్లు అన్నట్లుగా నోటికి వచ్చినట్లు మాట్లాడిన దయానిధి మారన్ ను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఇక.. సోషల్ మీడియాలో అయితే అతగాడి తెలివితేటల మీద జోకుల మీద జోకులు వేసుకుంటున్నారు.
Tags:    

Similar News