వాటి వాడకంతో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది : సీఎం కేజ్రీవాల్

Update: 2020-07-13 16:00 GMT
ఢిల్లీ ..దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయిన రాష్ట్రాల జాబితాలో మూడో స్థానములో ఉంది. ఢిల్లీ లో ఇప్పటివరకు ఒక లక్షా పదివేల మంది కరోనా భారిన పడగా .. 3,334 మంది కరోనా కారణంగా మరణించారు. అయితే , ఈ మద్యే ఢిల్లీ లో కరోనా కేసులు నమోదు అవుతున్న కూడా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి ప్రధాన కారణం పల్స్ ఆక్సిమీట‌ర్ల వాడడమే అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. హోం ఐసోలేషన్ ‌లో ఉన్న కరోనా రోగుల మరణాలను తగ్గించడంలో , ఈ పల్స్ ఆక్సిమీటర్లు ఉపయోగపడ్డాయి అని , వీటిని సురక్షా కవచాలు అంటూ ట్వీట్ చేశారు.

ఢిల్లీ లో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో హోం ఐసోలేష‌న్ ‌లో ఉన్న‌వారికి ఈ ప‌ల్స్ ఆక్సిమీట‌ర్లు అందివ్వాల‌ని సీఎం నిర్ణ‌యించారు. అయితే , రోగి ఆక్సిజ‌న్ స్థాయి 90 లేదా అంత‌క‌న్నా త‌క్కువ‌కు ప‌డిపోతే ఈ ప‌రిక‌రం వెంట‌నే అప్ర‌మ‌త్తం చేస్తుంది. ఆ తరువాత వారిని ఆసుపత్రికి తరలిస్తారు. రోజూవారి టెలి కౌన్సిలింగ్, ఆక్సిమీట‌ర్ల ద్వారా హోం ఐసోలేష‌న్ ‌లో ఉన్న‌వారి మ‌ర‌ణాల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయిందని ప్రభుత్వ వర్గాలు కుడి వెల్లడించాయి. ఈ ప‌ల్స్ ఆక్సిమీట‌ర్లు వాడటం తో చాలామంది ఆసుపత్రికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ కరోనా నుండి కోలుకున్నారు.
Tags:    

Similar News