అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడిన తెలుగు ఎన్నారై మధుకర్ రెడ్డి ఎపిసోడ్ లో మరో విస్మయకర పరిణామం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా భువనగిరిలో మధుకర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన అతని భార్య స్వాతిపై భర్త తరఫు బంధువులు దాడి చేశారు. స్వాతి వేధింపుల కారణంగానే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ ఈ దాడి చేసినట్లు సమాచారం.
అంత్యక్రియల సందర్భంగా పార్థివ దేహాన్ని చివరి చూపు చూసేందుకు వచ్చిన స్వాతిపై మధుకర్ కుటుంబ సభ్యులు చేయిచేసుకున్నారని సమాచారం. స్వాతి పెట్టిన తీవ్రమైన వేధింపుల కారణంగానే మధుకర్ ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడని వారు ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో స్వాతి తండ్రికి తలపై తీవ్ర గాయాలు అయినట్లు చెప్తున్నారు. దీంతో మధుకర్ కుటుంబ సభ్యులపై స్వాతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా స్వాతి తల్లి మాట్లాడుతూ భర్త మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన తన కుమార్తెపై దాడి చేయడం సరికాదని అన్నారు. తన కూతురు గత ఆరేళ్లుగా నరకం అనుభవిస్తోందనే పాప కోసం సర్దుకుపోవాలంటూ ఇన్ని రోజులు తన కూతురికి చెప్పుకుంటూ వచ్చానని చెప్పారు. అయితే అల్లుడి ఆత్మహత్యతో గత ఆరు రోజులుగా తమ కూతురు గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవద్దని ఆమె కోరారు. తన అల్లుడిది హత్యో, ఆత్మహత్యో త్వరలోనే తేలుతుందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపారు.
కాగా, ఐటీ ఉద్యోగి అయిన స్వాతిని మధుకర్ వివాహం చేసుకున్నారు. సియాటెల్‌లో నివసిస్తున్న వీరికి ఆరేళ్ల పాప ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత రెండేళ్ల క్రితమే సియాటెల్‌లో స్వాతి సోదరి-ఆమె భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/