ప‌వ‌న్ ఫాంహౌజ్‌ ద‌గ్గ‌ర మ‌ర్ద‌ర్‌..ఆ మ‌హిళ ఎవ‌రు?

Update: 2018-10-06 06:36 GMT
జ‌న‌సేన అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫాం హౌస్ వ‌ద్ద క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఓవైపు ఆయ‌న ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌ల్లో బిజీబిజీగా ఉంటే మ‌రోవైపు ఆయ‌న వ్య‌వ‌సాయ క్షేత్రం వ‌ద్ద ఊహించ‌ని ప‌రిణామం చోటుచేసుకుంది. ఓ మ‌హిళ ప‌వ‌న్ ఫాంహౌస్ వ‌ద్ద హ‌త్య‌కు గురికావ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని శంక‌ర్‌ప‌ల్లి మండ‌లంలో జ‌న్వాడ గ్రామంలో గ‌ల ప‌వ‌న్ ఫాంహౌస్ వ‌ద్ద‌ ఓ మ‌హిళ మృతి చెంది ప‌డి ఉండ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ఆ మహిళ వారం కింద‌ట హ‌త్య‌కు గురయిన‌ట్లు తెలుస్తోంది. హ‌త్య‌కు గురైన మ‌హిళ వివరాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం పోలీసులు చేస్తున్నారు. ఈ మేర‌కు ఆ మృత‌దేహాన్ని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి పోస్ట్‌మార్టం నిర్వ‌హించారు. కాగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫాం హౌస్ స‌మీపంలోని సీసీటీవీ పుటేజీని పోలీసులు సేక‌రించారు. ఇదిలాఉండ‌గా...ఏపీలో త‌న యాత్ర మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫాం హౌజ్ వైపు రాలేద‌ని స‌మాచారం.


Tags:    

Similar News