జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారమే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమి మాట్లాడుతాడో ? ఏమి చేస్తాడో కూడా ఎవరికీ అర్ధంకాదు. తాజాగా ఆయన మొదలుపెట్టిన జై కిసాన్ దీక్ష కూడా అలాంటిదే. ఎందుకంటే ఏపిలో సమస్యకు హైదరాబాద్ లో దీక్ష మొదలుపెట్టడంలో అర్ధమేంటి ? జై కిసాన్ దీక్ష పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం మొదలుపెట్టిన దీక్షను ఎవరు పట్టించుకునే అవకాశాలు లేవు. మిగిలిన వాళ్ళ సంగతిని పక్కన పెట్టేసినా ఇటు ప్రభుత్వం కానీ అటు మిత్రపక్షం బీజేపీ నేతలు కూడా గుర్తించటం లేదు.
ఎందుకంటే పవన్ మొదలుపెట్టిన దీక్ష ఏపిలో కాదు కాబట్టి ఏపి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అలాగే సమస్య తమది కాబట్టి తెలంగాణా ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. ఇక మిత్రపక్షమైన బీజేపీ నేతలు కూడా ఇదే కారణంతో పవన్ దీక్షకు దూరంగా ఉండిపోయారు. మామూలుగానే తెలంగాణాలో నేతలు జనసేనను మిత్రపక్షంగా గుర్తించటానికి ఇష్టపడం లేదు. ఈ విషయం మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది. అలాంటిది ఏపి సమస్యలపై హైదరాబాద్ లో దీక్షలు చేస్తే ఎవరైనా పట్టించుకుంటారా ?
నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పంటనష్టం క్రింద రూ. 35 వేలు ఇవ్వాలని, తక్షణసాయం క్రింద రూ. 10 వేలు ఇవ్వాలనే డిమాండ్ తో పవన్ దీక్ష మొదలుపెట్టారు. నిజానికి పవన్ డిమాండ్ లోనే అర్ధంలేదు. ఎందుకంటే పంటల నష్టంపై అధికారులతో ప్రభుత్వం సర్వేలు చేయిస్తోంది. డిసెంబర్ 15 కల్లా నివేదికలను అందిస్తే డిసెంబర్ 31వ తేదీకల్లా రైతులకు పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్వయంగా జగన్మోహన్ రడ్డి ప్రకటించారు.
సీఎం ప్రకటించిన తర్వాత మామూలుగా అయితే ఎవరు దీక్షలు చేయరు. కానీ పవన్ మాత్రం దీక్షలు మొదలుపెట్టేశారు. పోనీ చేసే దీక్ష రాజధాని ప్రాంతంలోనో లేకపోతే తుపాను నష్టం ఎక్కువగా జరిగిన ప్రాంతంలో మొదలుపెట్టుంటే వేరే విధంగా ఉండేది. కానీ పవన్ మాత్రం ఏపిలో సమస్యకు హైదరాబాద్ లోని తనింట్లో దీక్ష మొదలుపెట్టడమే విచిత్రంగా ఉంది. ప్రభుత్వానికి నిరసనగా దీక్ష చేస్తున్నపుడు పబ్లిక్ ప్లేసులో చేయాలి కానీ తనింట్లో చేస్తే ఎవరు పట్టించుకుంటారు ?
రైతుల సమస్యలపై తనింట్లో దీక్ష చేయమని పవన్ కు ఎవరు సలహా ఇచ్చారో అర్దం కావటం లేదు. నిజానికి అసలు దీక్షే అవసరం లేదు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళన చేసినా నిరసన తెలిపినా అర్ధముంది. సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టిన తర్వాత కూడా దీక్షకు దిగటమంటేనే పవన్ వైఖరి విచిత్రం కాక మరేమిటి ? ఇందుకే జనసేనాని మొదలుపెట్టిన దీక్షను ఎవరు పట్టించుకోవటం లేదు.