రాజ్యాంగాన్ని ఖూనీ చేసింది మీరే: కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ
ప్రధాని నరేందర మోడీ.. తాజాగా పార్లమెంటులో ప్రసంగించారు. ఆసాంతం కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
అడిగి మరీ తిట్టించుకోవడం.. అంటే కాంగ్రెస్‌కు చాలా ఇష్టంగా ఉన్నట్టుంది. ప్రధాని మోడీని పార్లమెంటు వేదికగా తప్పుబట్టాల ని.. రాజ్యాంగాన్ని ఆయన అవమానిస్తున్నారని ప్రజలకు వివరించాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఎదురు దాడి తప్పలేదు. ప్రధాని నరేందర మోడీ.. తాజాగా పార్లమెంటులో ప్రసంగించారు. ఆసాంతం కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. నెహ్రూ హయాం నుంచి ఇందిరమ్మ కాలం వరకు లెక్కలు చెప్పారు. రాజ్యాంగాన్ని అవమానించింది.. ఖూనీ చేసింది కూడా మీరేనని తీవ్రస్థాయి లోప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని ఇంతగా అవమానించింది.. ఎవరూ లేరని వ్యాఖ్యానించారు.
తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ చెప్పిన వినలేదని, ఆయనకు కూడా కనీస గౌరవం ఇవ్వకుండా.. రాజ్యాంగాన్ని మార్చార ని.. నాటి ప్రధాని నెహ్యూ వైఖరిని సభలో ఎండగట్టారు. మొత్తం 75 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేసిన వారు .. నేడు రాజ్యాం గ పరిరక్షకులుగా ప్రబోధించుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ''అప్పట్లో రాజ్యాంగానికి 75 సార్లు సవరణలు చేశారు. ఎమర్జెన్సీ విధించి ప్రజలను రాచి రంపాన పెట్టారు. వందల వేలమందిని జైళ్లలో కుక్కారు. కోర్టుల నోరు, పత్రికల గొంతు నొక్కేశారు. ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షకుల మంటూ.. ఊరూ వాడా తిరుగుతున్నారు'' అని ప్రధాని మోడీ పార్లమెంటులో తీవ్రస్థాయిలో గర్జించారు.
''ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పాలకులు చేసిన కుట్రలో రాజ్యాంగం నలిగిపోయింది. నెహ్రూ, ఇందిర, రాజీవ్ ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు. వీరే కాదు.. యూపీఏ హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను డమ్మీ చేసి.. పార్టీ అధ్యక్షురాలుచక్రం తిప్పారు. ఇదీ.. వీరి రాజ్యాంగ పరిరక్షణ'' అని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక.. 1947 నుంచి 1952 వరకు కాంగ్రెస్ కుటుంబమే దేశాన్ని ఏలిందని దుయ్యబట్టారు. ఎందుకు ఎన్నికలు పెట్టలేదో చెప్పలేక పోయారని నిలదీశారు. దేశానికి నష్టం చేసింది కాక.. నేడు రాజ్యాంగానికి ఏదో జరిగిపోతోందని మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని అన్నారు.
ప్రజలు బుద్ది చెప్పినా.. కాంగ్రెస్‌కు బుద్ది రాలేదని ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనేక రాష్ట్రాలలో ఆ పార్టీ నేతలు డిపాజిట్లు కోల్పోయారని అన్నారు. ప్రజల మద్దతు కూడగట్టడంలో విఫలమైన వారు.. రాజ్యాంగాన్ని విమర్శిస్తు న్నారని.. అఖండ అభిమానంతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నేడుతప్పుబడుతున్నారని దుయ్యబట్టారు. తమ పాలనలో జరుగుతున్న మంచిని చూడలేక కన్నీరు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి పదవి ఇస్తే.. జీర్ణించుకోలేక పోయారని.. మహిళల స్వావలంబనకు పథకాలు తెస్తే.. చూడలేకపోతున్నారని చెప్పారు. అయినా.. తమ ప్రగతి రథం ఆగదని ప్రధాని ఉద్ఘాటించారు.