చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మొత్తం 13మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యి సంచలనమైంది. అందులో క్రికెటర్ దీపక్ చాహర్ కూడా ఒకరు. దీంతో చెన్నై టీం మొత్తం అంతా క్వారంటైన్ లోకి వెళ్లింది. ఐపీఎల్ షెడ్యూల్ ను కూడా బీసీసీఐ హోల్డ్ లో పెట్టింది. ఈ నేపథ్యంలో దీపక్, రాహుల్ చాహర్ మధ్య రెండు వారాల క్రితం జరిగిన ఓ సంభాషణ వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా ఆగస్టు 14న చెన్నై ట్రైనింగ్ క్యాంప్ లో కొన్ని ఫొటోలను తీసుకున్న దీపక్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో చాహర్ తోపాటు ఎంఎస్ ధోని,సురేష్ రైనా, కరణ్ శర్మ, పీయూష్ చావ్లా తదితరులు ఉన్నారు. వారంతా మాస్క్ లు పెట్టుకోకుండా.. భౌతికదూరం కూడా పాటించలేదు.
మా అందరికీ రెండు సార్లు పరీక్షలు చేశారని నెగెటివ్ వచ్చిందని.. కుంటుంబంతో ఉన్నప్పుడు మాస్క్ ధరించమంటూ దీపక్, రాహుల్ చాహర్ లు మాట్లాడుకున్న ఆడియో లీక్ అయ్యింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు దుబాయ్ లో శిక్షణ శిబిరంలో మాస్క్ లు పెట్టుకోకుండా అవలంభించిన నిర్లక్ష్యమే వారి కొంప ముంచిందని తెలుస్తోంది.