టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు షాకిచ్చిన సొంతూరు ఓటర్లు

Update: 2021-11-02 09:30 GMT
హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంతూరు హిమ్మత్ నగర్ లో దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు ఓటర్లు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి.. గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామమైన హిమ్మత్ నగర్ లో ఈటల రాజేందర్ కు 191 ఓట్ల మెజారిటీ లభించింది.

గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామంలో బీజేపీ పార్టీకి ఏకంగా 549 ఓట్లు పోలయ్యాయి. ఇదేసమయంలో టీఆర్ఎస్ పార్టీకి 358 ఓట్లు వచ్చాయి. హిమ్మత్ నగర్ లో ఉన్నటువంటి యువత ఎక్కువగా బీజేపీవైపు మొగ్గు చూపినట్లు సమాచారం.

ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకూ 9 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం హిమ్మత్ నగర్ లోనూ బీజేపీ ఆధిక్యం సంపాదించడం టీఆర్ఎస్ శ్రేణులకు మింగుడు పడడం లేదు.

9వ రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ ఆధిక్యంలోకి వచ్చారు. ఈ రౌండ్ లో ఆయనకు 1835 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో ఈటల ఆధిక్యం ప్రస్తుతం 5105కు చేరింది.8వ రౌండ్ లో కాస్త వెనుకబడినట్టు ఈటల కనిపించినా 9వ రౌండ్ కి వచ్చేసరికి మళ్లీ పుంజుకున్నారు.ఇప్పటివరకు జరిగిన రౌండ్లలో ఈటలకు ఇదే భారీ ఆధిక్యం కావడం గమనార్హం.




Tags:    

Similar News