రేప్​ కేసు నిందితులకు 33 ఏళ్లకు శిక్ష..! లేట్ కావచ్చేమోగానీ శిక్ష తప్పదు..!

Update: 2021-05-15 10:30 GMT
మన న్యాయవ్యవస్థపై అనేక విమర్శలు ఉంటాయి. ఇండియాలో న్యాయం జరగడం అనేది అసాధ్యమని కొందరి వాదన. అందుకు అనుగుణంగానే అనేక వేల కేసులు పెండింగ్​లో ఉన్నాయి. ఇక ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు పెట్టినా.. న్యాయం అనేది ఇక్కడ అంత తేలికకాదు. తాలుకాస్థాయిలో శిక్ష పడినా.. జిల్లా స్థాయిలో ఆ తర్వాత హైకోర్టుకు, ఫైనల్​గా సుప్రీంకోర్టుకు కేసు వెళ్తుంది. ఈ ప్రక్రియ అంతా ముగిసేలోపు నిందితులు వృద్ధులయ్యే అయ్యే ప్రమాదం కూడా ఉంది. కానీ ఫైనల్​గా ఏదో రోజు శిక్ష మాత్రం పడుతుంది. 33 ఏళ్ల క్రితం జరిగిన ఓ రేప్​ కేసులో నిందితులకు తాజాగా శిక్ష పడింది.

 ఈ కేసులో ప్రధాననిందితులంతా ఇప్పటికే చనిపోయారు. ఇక మిగిలిన ఓ ముద్దాయిని కోర్టు దోషీగా  తేల్చి శిక్ష విధించింది. 33 ఏళ్ల క్రితం 12 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగికదాడి చేశారు. ఈ కేసులో నిందితురాలికి ఉత్తర్​ప్రదేశ్​లోని శ్రావస్తి స్థానిక  కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. 1988, జూన్‌ 30న ఉత్తరప్రదేశ్‌ శ్రావస్తిలో ఓ మైనర్​ బాలికపై అత్యాచారం జరిగింది. బాధితురాలు సమీప గ్రామంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా.. రామ్​వతీ ఆమె తల్లి ఫూల్‌మాత ముక్కు, పుస్సు, లాహ్రీ అనే ముగ్గురు వ్యక్తులకు అప్పగించారు. వారు ఆమెను రేప్​ చేశారు. ఈ కేసు సుదీర్ఘ విచారణ అనంతరం ఇప్పుడు ఫైనల్​కు వచ్చింది.

ఈ కేసులో ముక్కు, పుస్సు, లాహ్రీ, రామ్‌వతి, ఆమె తల్లి ఐదుగురిపై ఐపీసీ సంబంధిత విభాగాల కింద భింగా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ కేసులో విచారణ ఖైదీలంతా ఇప్పటికే మరణించారు. దీంతో ఓ ముద్దాయి మిగిలిపోయింది. ఆమెకు కోర్టు  15 వేల రూపాయల జరిమానా విధించింది. ఒక కోర్టులో సుదీర్ఘ కాలం విచారణలో ఉన్న కేసుగా ఇది రికార్డులకెక్కింది.
Tags:    

Similar News