కరోనాపై ఇన్నాళ్లు బ్రాహ్మాస్త్రంగా ‘ప్లాస్మా థెరపీ’ అనేవారు. కరోనాను జయించిన రోగుల నుంచి ఈ ప్లాస్మా తీసి కరోనా రోగులకు ఎక్కిస్తే నయం అయ్యేది. ఈ థెరపీతో కరోనా మరణాల సంఖ్య తగ్గించవచ్చని అనుకున్నారు. అయితే ఈ థెరపీతో కరోనా మరణాల సంఖ్య తగ్గుతుందని చెప్పలేమని ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) అభిప్రాయపడింది.
ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో కోవిడ్ సోకిన 30 మంది రోగులపై తాము ట్రయల్స్ నిర్వహించామని.. మరణాలు రేటు తగ్గిన దాఖలాలు లేవని ఎయిమ్స్ డైరెక్టర్ బాంబు పేల్చారు.
ప్లాస్మాతో రోగుల కండీషన్ లో మెరుగుదల లేదని ఎయిమ్స్ తేల్చింది. ప్లాస్మా ఇచ్చిన రోగులు, ఇవ్వని రోగుల్లో పెద్ద తేడా కనిపించలేదని వివరించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు సాగించనున్నట్టు వివరించారు. ప్లాస్మా థెరపీపై సమగ్ర పరీక్షలు జరపాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.