దేశ రాజధాని ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వీవీఐపీలు నివసించే ప్రాంతంలో బాంబు పేలుళ్లు ఎలా జరిగాయి అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. అయితే, ఈ పేలుళ్ల తరువాత బాంబు క్లూస్ టీమ్ రంగంలోకి దిగి అడుగడుగున పరిశీలించడం మొదలుపెట్టింది. పోలీసులు, ఎన్ఐఏ, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఇద్దరు నిందితులు ప్రయివేట్ క్యాబ్‌లో ఎంబసీ వద్దకు చేరుకున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వీటి ఆధారంగా నిందితుల ఊహాచిత్రాలను సిద్దం చేస్తున్న పోలీసులు.. వారు ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ ను ప్రశ్నించనున్నారు.అలాగే ఘటనా స్థలిలో నిందితులు ఓ లేఖను వదిలివెళ్లారు. ఇంగ్లీష్‌లో ఉన్న ఈ లేఖను ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశించిన రాశారు. ఇరాన్ అణు శాస్త్రవేత్త, జనరల్ అధికారిని చంపిన విషయాలను ఇందులో ప్రస్తావించారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, ఈ హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ రాయబారిని బెదిరించారని స్పెషల్ వర్గాలు పేర్కొన్నాయి.
కారులో వచ్చిన దుండగులు ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థాన్ని చుట్టి దాన్ని పూలకుండీలో విసిరేసి ఉంటారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అందులో బాల్ బేరింగ్స్ ఉన్నట్లు గుర్తించారు. సగం కాలిన పింక్ చున్నీని సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బీటింగ్ రీట్రీట్ జరిగిన విజయ్ చౌక్ ప్రాంతానికి పేలుడు సంభవించిన ప్రాంతం కేవలం 2కి.మీ దూరంలోనే ఉండటం గమనార్హం.
పేలుడుపై స్పందించిన ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది. అలాగే ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయానికి కూడా ఎటువంటి నష్టం జరగలేదని తెలిపింది. ప్రస్తుతం భారత దర్యాప్తు సంస్థలు దీనిపై విచారణ జరుపుతున్నాయని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో మాట్లాడి... ఇజ్రాయెల్ ఎంబసీకి,అక్కడి అధికారులకు పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు.
మరోవైపు, ఇజ్రాయెల్ ఎంబసీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ వివరాలను ప్రధానికి అధికారులు అందజేసినట్టు సమాచారం. పేలుడు జరిగిన ప్రదేశానికి కేవలం 1.4 కిమీ దూరంలోనే విజయ్ చౌక్ ఉంది. రిపబ్లిక్ డే వేడుకల ముగింపును సూచించే బీటింగ్ రిట్రీట్‌కు రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు విజయ్ చౌక్ వద్దకు హాజరై దాన్ని తిలకిస్తున్న సమయంలోనే ఇది చోటు చేసుకుంది. దీంతో కేంద్రం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఈ పేలుడుపై హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమీక్ష చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.