ఐపీఎల్ అంటేనే పరుగుల వరద, సిక్సర్ల మోత. అప్పుడే ప్రేక్షకులకు ఓ ఊపు, ఉత్సాహం వస్తాయి. బ్యాట్స్‌మెన్ ఎప్పుడెప్పుడు సిక్స్ లు కొడతాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇటువంటి టైంలో మ్యాచ్ ఎంత స్లోగా సాగుతుంటే ప్రేక్షకులు అంత నిరాశలో మునిగిపోతారు. నిన్న సరిగ్గా అటువంటిదే జరిగింది. నిన్నటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ జట్టు తలపడింది. ఢిల్లీ పటిష్ఠమైన జట్టు. బౌలింగ్ విషయంలో ఎంతో మెరుగ్గా ఉంది. గత సీజన్ లో ఫైనల్ వరకు చేరుకున్నది. అంతేకాక రిషబ్ పంత్, శిఖర్ ధావన్ లాంటి బ్యాట్స్మెన్లు ఉన్నారు.
ఇక బౌలింగ్, ఫీల్డింగ్ లో ఆ జట్టుకు తిరుగులేదు. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ రికీ పాంటింగ్ ఈ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. దీంతో ఢిల్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుంది. అయితే నిన్నటి మ్యాచ్ లో మాత్రం ఢిల్లీ జట్టు ప్రేక్షకుల ఉత్సాహాన్ని ఎంతో నీరుగార్చింది. శిఖర్ ధవన్ అవుట్ కాగానే రన్‌రేట్ దారుణంగా పడిపోయింది.రిషబ్ పంత్ కాసేపు పోరాడినప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయాడు. ఢిల్లీ ఇన్సింగ్స్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు.
నిన్నటి మ్యాచ్ వేదిక ముంబైలోని వాంఖడే స్టేడియం. వాంఖడే స్టేడియం అంటేనే పరుగులు మోత ఉంటుంది. కానీ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ పెద్దగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే ఇప్పటివరకు వాంఖడే స్టేడియంలో ఒక్క సిక్స్ కూడా కొట్టని టీం ఏదీ లేదు. అంతేకాక రిషబ్ పంత్ 50 పరుగులు చేసినప్పటికీ ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం గమనార్హం. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పరాజయం పాలైంది.