సుకేశ్ చంద్ర మ‌రో హాట్ లెట‌ర్ ఏకంగా 500 కోట్ల ఆరోప‌ణ‌!

Update: 2022-11-06 11:30 GMT
ఆర్థిక నేరగాడు, రూ.200 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్.. మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశాడు. పార్టీ ఫండ్ కోసం రూ.500 కోట్లు సమకూర్చాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 2016లో తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించాడు. దీనికి ప్రతిఫలంగా కర్ణాటక ఆప్‌ పార్టీలో కీలక స్థానం ఆఫర్ చేశారని తెలిపాడు. తనకు రాజ్యసభ సీటు ఆశచూపి కేజ్రీవాల్ రూ.50 కోట్లు తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఢిల్లీ దిల్లీ లెప్టినెంట్ గవర్నర్కు సుకేశ్ మరో లేఖ రాశాడు.

"2016లో కైలాశ్ గహ్లోత్ ఫామ్ హౌస్లో మీకు నేను రూ.50 కోట్లు ఇచ్చాను. అప్పుడు హైదరాబాద్ హయత్ హోటల్లో జరిగిన నా డిన్నర్ పార్టీకి సంత్యేంద్ర జైన్తో హాజరయ్యారు. నేను దేశంలోనే పెద్ద దొంగనైతే నా పార్టీకి మీరెందుకు వచ్చారు? 2017లో నేను తిహార్ జైలులో ఉన్నప్పుడు సంత్యేంద్ర జైన్ నన్ను చూడటానికి వచ్చినప్పుడు మీరు నాతో ఫోన్‌లో ఎందుకు మాట్లాడారు? పార్టీ ఫండ్ కోసం 30-40 మంది నుంచి రూ.500 కోట్లు సేకరించాలని 2016లో నాపై ఒత్తిడి ఎందుకు తెచ్చారు?" అని సుకేశ్, కేజ్రీవాల్ని ప్రశ్నించాడు.

"తమిళనాడులోని కొంతమంది ఎమ్మెల్యేలు, నటీనటులను ఆప్‌లో చేరేలా నా ద్వారా ఒప్పించాలని జైన్‌కు ఎందుకు చెబుతూ వచ్చారు? ఈ విషయంపై 2016, 2017లో నాపై ఒత్తిడి ఎందుకు తెచ్చారు? 2019లో జైలులో నాకు రక్షణ కోసం జైన్‌కు మరో రూ.10 కోట్లు ఇచ్చినప్పుడు మీరు సరే అని ఎలా అన్నారు" అని కేజ్రీవాల్ను సుకేశ్ ప్రశ్నించారు. సత్యేంద్ర జైన్, కేజ్రీవాల్లకు వ్యతిరేకంగా లేఖ రాసిన తరువాత తనకు బెదిరింపులు వస్తున్నాయని సుకేశ్ పేర్కొన్నాడు. తిహార్ జైలు మాజీ డీజీ నుంచి బెదిరింపులు వచ్చాయని లేఖలో వివరించాడు. దీనిపై కేజ్రీవాల్ కానీ, ఆప్ నాయ‌కులు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్మం.
Tags:    

Similar News