ఈ మధ్య కాలంలో ఆడవారి పై జరిగే దారుణాలు సంఖ్య రోజురోజుకి జనాభా లెక్కల మాదిరి పెరిగిపోతుంది. సెకన్ కి ఒక రేప్ ..నిముషానికో మర్డర్ అన్నట్టుగా సాగిపోతుంది ఈ వ్యవహారం. దీనిపై పోలీసులు - ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ఆడవారి పై జరిగే అఘాయిత్యాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ మద్యే హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన ప్రతిష్ఠాత్మక దిశ బిల్లు -2019 పైన ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ సినీ హీరో చిరంజీవి ఈ బిల్లు తీసుకురావటం పైన ముఖ్యమంత్రి జగన్ ను అభినందించారు. అదే విధంగా పలువురు సినీ ..రాజకీయ ప్రముఖులు సైతం ప్రశంసించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సైతం బిల్లుకు మద్దతు ప్రకటించింది. ఇక, ఇదే అంశం పైన తాజాగా ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది.
ఈ బిల్లును ప్రతిపాదించటం..ఆమోదించటం పైన ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఢిల్లీ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిని సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం చదివి వినిపించారు. బిల్లును ఆమోదించినందుకు సభలోని ప్రతీ సభ్యుడిని అభినందిస్తూ..బిల్లు కాపీ..పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు రాసిన లేఖలో అభ్యర్ధించింది. ఏపీ ప్రభుత్వ ఈ నెల 11న కేబినెట్ లో ప్రతిపాదించిన దిశ చట్టం - 2019 బిల్లును.. ఈ నెల 13న శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించింది.ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు పైన ఢిల్లీ ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసించింది. బిల్లు కాపీనీ ..పూర్తి వివరాలతో తమకూ పంపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కోరారు.
ఏపీ కేబినెట్..అసెంబ్లీ ఆమోదించిన దిశ చట్టం -2019 బిల్లులో ఒక భాగానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంది. ఏపీలో ఎవరైనా మహిళపై అత్యాచారం చేస్తే..నిర్ధారించే ఆధారాలు ఉంటే వారికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా ఏపీ ప్రభుత్వం కొత్తగా బిల్లును ఆమోదించింది. తొలి వారం రోజుల్లోనే పోలీసులు పూర్తి సమాచారం ..ఆధారాలు సేకరించాలి. అదే విధంగా రెండు వారాల్లోనే ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి..శిక్ష విధించే విధంగా బిల్లులో ప్రతిపాదించారు. దీని కోసం మొత్తం 13 జిల్లాల్లోనూ ప్రత్యేకంగా పాస్ట్ ట్రాక్ కోర్టులు..పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటుగా డీఎస్పీ ర్యాంకు అధికారులతో ప్రత్యేక పోలీసు టీంలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది గవర్నర్ వద్దకు వెళ్లినట్లు సమాచారం.