దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం సమయంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. అయితే వర్షం దేశంలోని పలు ప్రాంతాల్లో పడుతుంది, వర్షం పడటంలో వింతేముంది అనుకుంటున్నారా .. అక్కడే ఉంది ట్విస్ట్, ఇప్పటి వరకు నీళ్లు కురవడం తెలుసు, మంచి కురవడం తెలుసు, ఇసుక పడటం కూడా చూసాం , రాళ్లు పడటం కూడా చూసాం కానీ ఆయిల్ వర్షం పడటం చూసారా..విన్నారా, నిన్న ఢిల్లీలో వర్షం కురుస్తుంటే అక్కడి అగ్నిమాపక శాఖకు వచ్చిన ఫోన్కాల్స్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్య పోక తప్పదు.
వాళ్ళ ఏరియాలో ఆయిల్ వర్షం కురుస్తోందంటూ కొందరు కాల్ చేసి ఫిర్యాదులు ఇవ్వడం చర్చనీయాశం అయింది. న్యూ ఢిల్లీలోఐ చాల ఏరియాల నుండి 57కు పైగా కాల్స్ వచ్చాయట అంతే కాకుండా అందరూ ఈ విషయం గురించే చెప్పి ఫిర్యాదు చేశారట. వారిలో ఎక్కువగా బైకర్లు ఉన్నారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. తాము వెళుతుంటే రోడ్డుపై ఆయిల్ తరహా పదార్థం ఉందని, దీంతో రోడ్డుపై జారుతున్నట్లుగా అనిపించిందని తెలిపినట్లు ఆయన తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. ఈ విషయంపై దర్యాప్తు చేపడుతూనే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆయిల్ వర్షం వల్ల రోడ్లు జారుడుగా మారి ప్రజలు , వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో జామియా నగర్కు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేశారు. ఈ విషయంపై ఫిర్యాదు మేరకు న్యూ ఫ్రెండ్స్ కాలనీలో అగ్నిమాపక సిబ్బంది పలు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.