కారుతో ఢీకొట్టి.. 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి.. ఢిల్లీ యువతి ఘటన దారుణం!
కొత్త సంవత్సరం రోజు దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్కూటీపై వెళ్తున్న 23 ఏళ్ల యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. కారు చక్రాల మధ్యలో చిక్కుకొని కిలోమీటర్ల మేర మహిళను ఈడ్చుకెళ్లడంతో ఆమె శరీరం పూర్తిగా ఛిద్రమైంది. తీవ్ర గాయాలపాలైన యువతి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనలో మృతి చెందిన బాధితురాలిని అమర్ విహార్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఆమె శుభకార్యాలను నిర్వహించే ఈవెంట్ కంపెనీలో పనిచేస్తోంది. ఎప్పటిలాగే కార్యక్రమ పనులు ముగించుకొని డిసెంబర్ 31న రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘోరం చోటుచేసుకుందని తెలుస్తోంది. కాగా యువతి తన తండ్రి చనిపోవడంతో ఈవెంట్ కంపెనీలో పనిచేస్తూ తన తల్లి, నలుగురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముల్లను పోషిస్తోంది.
కాగా కుటుంబానికి పెద్ద దిక్కైన యువతి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డిసెంబర్ 31న సాయంత్రం ఆరుగంటలకు న్యూ ఇయర్ ఈవెంట్ కోసం తమ కుమార్తె బయటకు వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి 9 గంటలకు కాల్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పినట్లు వెల్లడించారు. రాత్రి 10 గంటలకు మళ్లీ కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చిందని అంటున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో తమ కూతురు ప్రమాదానికి గురైనట్లు ఢిల్లీ పోలీసులు చెప్పినట్లు విలపించారు.
కాగా కారు ఈడ్చుకుపోయిన ఘటనలో యువతి మృతదేహం నగ్నంగా కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను పోలీసులు రక్షిస్తున్నారని.. నిందితుల్లో బీజేపీ నేత ఒకరున్నారని అంటున్నారు. ఇది యాక్సిడెంట్ కాదని.. అలా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు.
ఆదివారం తెల్లవారు జామున స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టిన కొంతమంది యువకులు అక్కడితో ఆగకుండా కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకుపోయినట్టు సీసీ కెమెరాల్లోనూ రికార్డు అయ్యంది. రోహిణిలోని కంజావాల్ నుంచి కుతూబ్‌గఢ్ వైపు వెళ్తున్న కారు మహిళను ఈడ్చుకెళ్తున్నట్లు ఆదివారం తెల్లవారు జామున 3.24 నిమిషాలకు పోలీసులకు సైతం ఫోన్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని అన్ని చెక్‌పోస్టులను అలెర్ట్ చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి కారు నెంబర్ కూడా చెప్పడంతో వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఇంతలోనే రోడ్డుపై నగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం పడి ఉన్నట్లు ఉదయం 4 గంటలకు కంజావాలా పోలీసులకు మరో ఫోన్ కాల్ వచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను మంగోల్‌పురిలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. చాలా దూరం కారుతో ఊడ్చుకెళ్లడంతో యువతి వెనకవైపు శరీరమంతా తీవ్రంగా గాయపడినట్లు, కాలిన గాయాలు ఉన్నట్లు చెబుతున్నారు. తలకు గాయమవ్వడంతోపాటు చేతులు, కాళ్లు కొట్టుకుపోయాయని పేర్కొంటున్నారు.
యువతిని ఢీకొట్టిన అనంతరం కారులోని వ్యక్తులు వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యారు. ఆమెను అలాగే సుల్తాన్‌పూరి నుంచి కంజావాలా వరకు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు.
నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసిన పోలీసులు అదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్ ఖన్నా(26), అమిత్ ఖన్నా(25), క్రిష్ణణ్(27), మిథున్(26), మనోజ్ మిత్తల్‌గా గుర్తించారు. అరెస్టయిన వారిలో క్రెడిట్ కార్డు కలెక్షన్ ఏజెంట్, డ్రైవర్, రేషన్ షాపు యజమాని ఉన్నారు. ఘటన సమయంలో దీపక్ కారు డ్రైవ్ చేస్తున్నట్లు తేలింది.
సుల్తాన్‌పురి ప్రాంతంలో తమ కారు స్కూటీని ఢికొట్టిన్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. కానీ మహిళ కారు చక్రాలకు చిక్కుకుందన్న విషయం తమకు తెలీదని తెలిపారు. నిందితులంతా మద్యం మత్తులోకారు డ్రైవ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని కోర్టులో హజరుపరచగా.. మూడు రోజుల కస్టడీకి అప్పగించింది.
అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని పోలీసులు పేర్కొనగా, దీపక్ అనే ఓ ప్రత్యక్ష సాక్షి మాత్రం కారులో ఉన్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆ యువతిని కారుతో లాక్కెళ్లారని, గంటన్నర పాటు పలుమార్లు యూటర్నులు తీసుకుంటూ 12 కి.మీ. దూరం వాహనాన్ని నడిపారని వెల్లడించడం కలకలం రేపుతోంది. రోడ్డులో పోలీస్ బారికేడ్లు చూసి కారు యూటర్న్ తీసుకోవడం తాను చూసినట్లు ఓ ఫుడ్ డెలివరీ బాయ్ తెలిపాడు. కారుతో నిర్దాక్షిణ్యంగా బాధితురాలిని లాక్కెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు రేగాయి. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని స్థానికులు సుల్తాన్‌పురి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టి రహదారిని దిగ్బంధం చేశారు. ఆప్ నేతలు కూడా ఎల్జీ నివాసం ఎదుట నిరసనకు దిగారు.
కాగా ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ స్పందించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనను అత్యంత అరుదైన నేరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీనిపై ఎల్జీతో మాట్లాడానని తెలిపారు. రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎల్జీ సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానవీయ ఘటన తెలిసి తలకొట్టేసినట్లయిందని ట్వీట్ చేశారు. దర్యాప్తును వేగవంతం చేయడానికి ప్రత్యేక కమిషనర్ షాలినీ సింగ్ నేతృత్వంలో విచారణ కమిటీని ఢిల్లీ పోలీసు విభాగం నియమించింది.
ప్రత్యేక మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా నిందితులపై మరిన్ని సెక్షన్లు నమోదు చేస్తామని చెప్పారు.
ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా–ఢిల్లీ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా.. అనేక వాహనాలు అతడి మృతదేహంపై నుంచే రాకపోకలు సాగించాయి. మధ్యప్రదేశ్‌లోని గోవింద్‌నగర్‌కు చెందిన చరణ్ నర్వారియా(30) అనే యువకుడిని.. ఆగ్రా–ఢిల్లీ జాతీయ రహదారిపై జనవరి 1 రాత్రి ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో వాహనాలన్నీ అతడి శరీరంపై నుంచే వెళ్లాయి. దీంతో అతడి బాడీ నుజ్జునుజ్జయ్యింది. దాదాపు 100 మీటర్ల మేర చిన్నచిన్న ముక్కలుగా చెల్లాచెదురుగా పడిపోయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.