హర్యానా ఆక్సిజన్ సిలిండర్ ను ఎత్తుకెళ్లిన ఢిల్లీ ప్రభుత్వం?

Update: 2021-04-21 17:30 GMT
దేశంలో కరోనా వేళ మౌలిక వసతుల కోసం ప్రభుత్వాల మధ్య కొట్లాట మొదలైంది. తమ ఆక్సిజన్ ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం ఎత్తుకెళ్లిందని హర్యానా ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది.

తాజాగా తమ పొరుగురాష్ట్రం ఢిల్లీపై హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ వవిజ్ సంచలన ఆరోపణలు చేశారు. తమ రాష్ట్రానికి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లలో ఒకదాన్ని ఢిల్లీ ప్రభుత్వం దొంగతనంగా తీసుకెళ్లిందని హర్యానా ఆరోగ్యమంత్రి ఆరోపించారు. ఫరీదాబాద్ కు నిన్న వస్తున్న ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం తీసుకెళ్లిందని తెలిపారు.

ఇక నుంచి ఆక్సిజన్ ను తీసుకొస్తున్న వాహనాలకు పోలీసులు భద్రత కల్పించాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలే ఇలా కరోనా వేళ దొంగతనాలకు పాల్పడితే ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని హర్యానా మంత్రి అభిప్రాయపడ్డారు.  తమ ఆక్సిజన్ ట్యాంకర్లను ఢిల్లీకి పంపించాలని ఒత్తిడి వస్తోందని తెలిపారు. అయితే తమ రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే తాము ఆ పనిచేయగలమని మంత్రి విజ్ తెలిపారు.
Tags:    

Similar News