మీ వ‌ల్ల అవుతుందా లేదా? - స‌ర్కారుపై హైకోర్టు ఆగ్ర‌హం

Update: 2021-04-28 04:41 GMT
దేశంలో అత్య‌ధిక కొవిడ్ మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఉంది. ఆక్సీజ‌న్ అంద‌క ప్రాణాలు కోల్పోతున్న బాధితులు అక్క‌డ ఎక్కువ‌గా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ప్ర‌భుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలో ఆక్సీజ‌న్ బ్లాక్ మార్కెట్ కు త‌ర‌లిపోతోంద‌ని, ఈ దందాను అడ్డుకోవ‌డం మీ వ‌ల్ల అవుతుందా? లేదా? అని న్యాయ‌స్థానం ప్ర‌శ్నించిన‌ట్టు తెలుస్తోంది.

ఆక్సీజ‌న్ సిలిండ‌ర్లు బ్లాక్ మార్కెట్ కు త‌ర‌లిస్తుంటే.. ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేక‌పోతోంద‌ని కోర్టు వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. మీ అధికారాలు మీకు తెలిసి ఉండాల‌ని కేజ్రీవాల్‌ స‌ర్కారుపై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఆక్సీజ‌న్ సిలిండ‌ర్ల‌ను డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు అందజేసిన త‌ర్వాత ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని, అవి ఎక్క‌డ‌కు చేరుతున్నాయో అనే ప‌ర్య‌వేక్ష‌ణ లేద‌ని కోర్టు వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వ ఆల‌స‌త్వంతోనే డిస్ట్రిబ్యూట‌ర్లు ఆక్సీజ‌న్ ఉన్న‌ బ్లాక్ మార్కెట్ కు త‌ర‌లిస్తున్నార‌ని కోర్టు అన్న‌ట్టుగా తెలుస్తోంది.

న్యాయ‌వాదుల‌కు స్టార్ హోట‌ళ్ల‌లో చికిత్స‌కు వ‌స‌తి క‌ల్పిస్తున్నార‌నే అంశంపైనా కోర్టు మండిప‌డిన‌ట్టు తెలిసింది. హోట‌ళ్ల‌లో సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ఎవ‌రు అడిగార‌ని, ఇదంతా త‌మ‌ను శాంతిప‌జేసేందుకేనా? అని నిల‌దీసిన‌ట్టు స‌మాచారం.

బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ పై కూడా కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన‌ట్టు స‌మాచారం. కొవిడ్ పేషెంట్ల‌కు.. త‌న ఛారిటీ సంస్థ త‌ర‌పున గంభీర్ భారీగా మందులు కొనుగోలు చేసి అందిస్తున్నారు. అయితే.. గంభీర్ ఒక్క‌డే అన్ని మందులు ఎలా కొనుగోలు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించిన‌ట్టుగా తెలిసింది. లైసెన్స్ లేకుండా.. భారీగా ఎలా మందులు కొంటున్నాడ‌ని, అత‌డికి లైసెన్స్ అవ‌స‌రం లేదా? అని ప్ర‌శ్నించిన‌ట్టుగా తెలుస్తోంది.
Tags:    

Similar News