వైసీపీ.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అయితే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అని కూడా అంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరుమీదుగానే దానికి కలిసేలా ఆ పార్టీ పేరును అధినేత జగన్ తీర్చిదిద్దారు.
అయితే జగన్ వైసీపీ పార్టీని రిజిస్ట్రర్ చేయకముందే మహబూబ్ బాషా అనే వ్యక్తి ‘వైఎస్ఆర్’ మీద అభిమానంతో ‘వైఎస్ఆర్ కాంగ్రెస్’ అనే పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇప్పుడు జగన్ పార్టీకి, మహబూబ్ బాషా పార్టీ పేరు సేమ్ కావడంతో పంచాయితీ మొదలైంది.
రాజకీయ ప్రత్యర్థులకు అధికార వైసీపీపై పగ తీర్చుకోవడానికి మహబూబ్ బాషా పార్టీ ఒక ఆయుధంగా దొరికిందంటారు. అందుకే జగన్ పార్టీ పేరును సొంతం చేసుకోవడానికి ఎన్నికలకు ముందు నుంచే ఈ గొడవ మొదలైందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు.
తాజాగా ఎన్నికల సంఘం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (జగన్ పార్టీకి) ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ప్రచారం చేసి.. తమ పార్టీ పేరు దెబ్బతీస్తున్నారని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా పిటీషన్ దాఖలు చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరారు.
దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.