ఢిల్లీ లిక్కర్ స్కాం ఎపిసోడ్ ఒక లెక్క అయితే కవిత ఫోన్లు మరో లెక్కనా?

Update: 2022-12-03 03:05 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు సంబంధాలు ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలిసిందే. తాజాగా సీబీఐ నుంచి ఆమెకు నోటీసులు అందటం.. వాటికి బదులుగా ఈ నెల ఆరున హైదరాబాద్ లోని తన నివాసంలోనే అధికారుల్ని కలుసుకోనున్నట్లుగా ఆమె బదులు ఇవ్వటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఫోన్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ స్కాంలో శరత్ అరోడాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన్ను రిమాండ్ కు తరలించిన వేళలో.. సిద్ధం చేసిన  రిపోరర్టులో తొలిసారి కవిత పేరు కనిపించింది. అదే సమయంలో కవిత సెల్ ఫోన్లకు సంబంధించిన అంశాల్ని పేర్కొన్నారు. అనుకోని రీతిలో వాటిని ప్రస్తావించారా? లేదంటే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆమె ఫోన్ల ప్రస్తావన తెచ్చారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఎందుకంటే.. కవిత ఫోన్లకు సంబంధించి బయటకు వచ్చిన వివరాలు ఆసక్తికరంగానే కాదు.. అండర్ లైన్ చేసుకునేలా ఉండటమే దీనికి కారణం. ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ఏడాది వ్యవధిలో కవిత తనకున్న రెండు నెంబర్లకు సంబంధించి ఏకంగా పది ఫోన్లు మార్చినట్లుగా చెబుతున్నారు.

ఇందులో ఐదు ఫోన్లు ఈ ఏడాది ఆగస్టు 9, 22, 23, 24 తేదీల్లో మార్చినట్లుగా బయటకు వచ్చింది. ఇంతకూ ఏడాదిలో పది ఫోన్లు మార్చటం ఒక ఎత్తు అయితే.. కేవలం మూడు రోజుల వ్యవధిలో అన్నేసి ఫోన్లు  అంత త్వరగా మార్చేయటంలో లెక్కేంటి? పత్రం ఏమిటి? అన్నది ప్రశ్న.

ఫోన్ల వ్యవహారం తెర మీదకు వచ్చిన రెండో రోజే సీబీఐ నుంచి కవితకు నోటీసులు రావటం చూస్తుంటే.. రానున్న రోజుల్లో పది ఫోన్ల పంచాయితీ మరింత భారీగా బయటకు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిలో తనకున్న రెండు నెంబర్లకు సంబంధించి పది ఫోన్లు మార్చారన్న అధికారుల ప్రస్తావన చూస్తే.. ఆమె ఎపిసోడ్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని ముందుగానే సేకరించి.. ఒక పద్దతి ప్రకారం పని జరుగుతుందా? అన్నది ప్రశ్న.

ఇంతకూ పది ఫోన్లను ఏడాది వ్యవధిలో మార్చటం ఎందుకు? అన్నది ఒక ప్రశ్న అయితే.. కేవలం మూడు రోజుల వ్యవధిలో వేర్వేరు ఫోన్లను మార్చేయటం ఎందుకు? అన్న ప్రశ్నలు కవితకు ఇబ్బందికరంగా మారతాయని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News