ఇటీవల గణతంత్ర దినోత్సవం నాడు.. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు ఆందోళనకారులు ఎర్రకోటపై వివాదాస్పద జెండాలను ఎగరవేశారు. ఈ జెండాలు ఎగరవేసిన వాళ్లలో దీప్ సిద్దూ, జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జంత్ సింగ్bఉన్నారు. జనవరి 26 తర్వాత దీప్ సిద్దూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా సిద్ధూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్ర కోట వద్ద జెండాలు ఎగురవేసిన దీప్ సిద్దూ - జుగ్రాజ్ సింగ్ - గుర్జోత్ సింగ్ - గుర్జంత్ సింగ్‌ల గురించి సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు గతంలో ప్రకటించారు.
15 రోజులుగా దీప్ సిద్ధూ కనిపించకుండా పోయారు. తాజాగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దీప్ సిద్ధూను అదుపులోకి తీసుకున్నారు.జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనలపై బీకే సింగ్ నేతృత్వంలో డీసీపీలు జాయ్ టుర్కీ - భేషంసింగ్ - మోనికా భరద్వాజ్ లు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
రైతుల ఆందోళన సందర్భంగా దీప్ సిద్ధూ రెచ్చగొట్టే ప్రసంగాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అయితే దీప్ సిద్ధూ ఫేస్‌బుక్‌ను విదేశాల నుంచి అతడి గర్ల్ ఫ్రెండ్ నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక్కడి నుంచి సిద్ధూ వీడియోలు పంపిస్తుండగా.. ఆమె ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.