ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు !

Update: 2020-01-09 11:32 GMT
దేశంలో ఉగ్రవాదులు ఎటువంటి దాడులు చేయకుండా ఎన్ని గట్టి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా , ఎదో ఒక విధంగా దేశంలోకి చొరబడి దాడులకు దిగుతున్నారు. తాజాగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో భారీ ఉగ్ర కుట్రని భగ్నం చేయగలిగారు. ఈ రోజు ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ఇవాళ ఉదయం జరిగిన ఓ ఎన్‌ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ జరిగిన తరువాత ఐఎస్ ఐ ఎస్‌ తో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడినట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి.


ఈ ఎన్‌ కౌంటర్ తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లుపోలీసులు తెలిపారు. ఐసిస్ నిందితులను దేశ రాజధానిలో అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. గణతంత్ర దినోత్సవాల కోసం దేశం యావత్తూ సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజధానిలో కలకలం రేగింది. పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదుల నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాయి. తమిళనాడు పోలీసులు ఓ జిహాదీ ఉగ్రవాద ముఠాను పట్టుకున్న రోజే ఢిల్లీ పోలీసులకు మరో ముగ్గురు ఉగ్రవాదులు చిక్కడం గమనార్హం. ఇక అరెస్ట్ ముగ్గురి వివరాలని చూస్తే .. ఖ్వాజా మౌద్దీన్ (52), సయ్యద్ నవాజ్ (32), అబ్దుల్ సమద్ అని సమాచారం. కాగా , ఎస్ ఐ ఎస్ కదలికల పై కొద్ది రోజుల నుంచి నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నేపాల్ సరిహద్దు ద్వారా 5గురు అనుమానితులు భారత భూభాగంలోకి ప్రవేశించినట్టు ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. దీనితో నేపాల్ సరిహద్దు కలిగిన యూపీ జిల్లాల్లో హై అలర్ట్ హెచ్చరిక జారీ చేశారు.
Tags:    

Similar News