సీఏఏ అల్లర్లు: 15000 పేజీల చార్జిషీట్ దాఖలు

Update: 2020-09-16 17:35 GMT
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ అల్లర్లు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా అట్టుడుకింది. ఈ ఘటనపై తాజాగా ఢిల్లీ పోలీసులు బుధవారం 15000 పూజీలతో చార్జీషీట్ దాఖలు చేశారు.

ఈ చార్జీషీట్ లో 15మంది పేర్లను ప్రధానంగా పొందుపరిచారు. ఢిల్లీ అల్లర్లలో 53మంది చనిపోయినట్టు నివేదించారు.

ఈ హింసాకాండపై కర్కుదుమా కోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ లో ఢిల్లీ పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. దీనికి 15మంది నిందితులు కారణంగా పేర్కొన్నారు.

వీరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం, ఐపీసీ, ఆయుధ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

ఢిల్లీ పోలీసుల చార్జీషీట్ లో జేఎన్.యూ నేత ఉమర్ ఖలీద్, సర్జీల్ ఇమాంల పేర్లు పేర్కొనకపోవడం గమనార్హం. అయితే అనుబంధ చార్జీషీట్ లో వీరి పేర్లను చేరుస్తారని సమాచారం. కొద్దిరోజుల కిందటే వీరు అరెస్ట్ అయ్యారు.
Tags:    

Similar News