ఢిల్లీలో పెరిగిన కాలుష్యం వల్ల ఇప్పటికే చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా ఈ కాలుష్యం జనాల జేబులను కూడా ఖాళీ చేస్తుంది. పరిశ్రమ, సేవారంగం, పర్యాటక రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాలుష్య పరోక్ష ప్రభావం ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై పడింది. దీని కారణంగా 2020లో 60 వేల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని గ్రీన్‌పీస్, గ్లోబల్ క్యాంపెయిన్ గ్రూప్ నివేదిక చెబుతోంది. ఇది ఢిల్లీ ప్రభుత్వ ఒక సంవత్సరపు బడ్జెట్‌తో సమానం. అయితే పొల్యూషన్ ఇలాగే కొనసాగితే వినాశనం ఇంకా పెరుగుతుందని నివేదిక పేర్కొంది.
పరిశ్రమలు పూర్తిగా ధ్వంసమై ప్రజలు వలసబాట పట్టాల్సి వస్తోంది. నగరంలో నానాటికీ దిగజారుతున్న వాయు కాలుష్యం పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాలుష్యం కారణంగా ప్రజలు ఇతర నగరాలకు వెళ్తున్నారు. డెల్బర్గ్ బ్లూ స్కై నివేదిక ప్రకారం.. ఢిల్లీలోని 40 శాతం మంది ప్రజలు రాజధానిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. ఢిల్లీలో కాలుష్యం ప్రభావం పర్యాటకంపై పడింది. కాలుష్యం కారణంగా ఢిల్లీకి వచ్చే పర్యాటకుల సంఖ్య 2.5 కోట్లు తగ్గింది. 35-50 ఏళ్లలోపు పర్యాటకులు చాలా మంది రావడం మానేశారు.
ఒక అంచనా ప్రకారం.. ఢిల్లీలో పర్యాటకం దాదాపు 40 శాతం పడిపోయింది. దీని కారణంగా చిన్న వ్యాపారులు, టాక్సీలు, రెస్టారెంట్ల ఆదాయం సగానికి తగ్గింది. పర్యాటకులతో కిటకిటలాడే జనపథ్ మార్కెట్ ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. కాలుష్యం జనపథం శోభను దూరం చేసింది. దీంతో దుకాణదారుల సమస్యలు పెరిగాయి. 50 నుంచి 60 శాతం వరకు వ్యాపారం తగ్గింది. వ్యాపారులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ పర్యాటకం మూసివేశారు. ఇప్పుడు దేశీయ పర్యాటకులు కూడా కాలుష్యం కారణంగా ఢిల్లీకి దూరంగా ఉంటున్నారు.