కలకలం... ఉక్రెయిన్ పై ఖండతర బాలిస్టిక్ క్షిపణితో రష్యా దాడి!

గత వెయ్యి రోజులుగా లేనిది తొలిసారి ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణితో రష్యా దాడి చేసింది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2024-11-21 12:52 GMT

అనుకున్నంతా అవుతోంది.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తీవ్రమవుతోంది.. పరిస్థితి చేయిదాటిపోతోన్నట్లు కనిపిస్తోంది.. ప్రపంచానికి పాకేలా అనిపిస్తోంది! తాజాగా కీలక పరిణామం తెరపైకి వచ్చింది. గత వెయ్యి రోజులుగా లేనిది తొలిసారి ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణితో రష్యా దాడి చేసింది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర కలకలం రేపుతోంది.

అవును... రష్యా తొలిసారిగా ఉక్రెయిన్ పై ఖండాతర క్షిపణితో దాడి చేసింది. ఈ క్షిపణి డెనిపర్ నగరంపై దాడి చేసిందని చెబుతూ... ఉక్రెయిన్ వాయుసేన సంచలన విషయాన్ని వెల్లడించింది. దీంతో పాటు ఎక్స్-47ఎం2 కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించినట్లు తెలిపింది. అయితే.. ఇవి ఏ రకం క్షిపణులో మాత్రం ఖచ్చితంగా వెల్లడించలేదు!

ఉక్రెయిన్ కు తాము అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడిని వినియోగించుకునేందుకు ఆ దేశానికి అనుమతి ఇస్తున్నట్లు బైడెన్ సర్కార్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా అమెరికా ప్రకటించిన అనంతరం అలాంటి దీర్ఘశ్రేణి క్షిపణినే ఉక్రెయిన్ పై రష్యా ప్రయోగించడం గమనార్హం.

ఈ క్రమంలో.. తాజాగా రష్యా తమపై ఖండాంతర క్షిపణితో దాడి చేసిందంటు ఉక్రెయిన్ వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఉక్రెయిన్ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. ఇదే సమయంలో ఆ విషయం తమ సైనికులను అడగాలంటూ క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొనడం గమనార్హం.

కాగా.. కనీసం 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదింగల సామర్ధ్యం ఉన్నప్పుడు ఈ ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తారు. లక్ష్యం ఇంతదూరం ఉంటే ప్రయోగించినవాటిని దీర్ఘశ్రేణి ఆయుధంగా పరిగణిస్తారు. లక్ష్యం 3,000 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్ల మధ్య ఉన్నవాటిని ఛేదించేందుకు వాడేవి మధ్యశ్రేణి క్షిపణులు.

ఈ దీర్ఘశ్రేణి క్షిపణులను 1957లో తొలిసారిగా సోవియట్ యూనియన్ విజయవంతంగా పరీక్షించగా.. ఆ తర్వాత 1959లో అమెరికా వీటిని విజయవంతంగా పరీక్షించింది.

Tags:    

Similar News