వైసీపీకి షాక్...జనసేనకే పీఏసీ చైర్మన్
ఏపీ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు అని ప్రచారం సాగుతోంది.
ఏపీ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు అని ప్రచారం సాగుతోంది. భీమవరం ఎమ్మెల్యేగా ఉన్న జనసేన నేత పులపర్తి రామాంజనేయులుకు ఈ పదవిని ఇస్తున్నారు. ఆయన టీడీపీలో ఉంటూ ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్లారు. ఆయనకు పవన్ టికెట్ ఇచ్చి సమాదరించారు.
ఇపుడు ఆయనకు కీలకమైన పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. నిజానికి పీఏసీ కమిటీకి ఎన్నికలు పెట్టడం ద్వారా వైసీపీకి టీడీపీ కూటమి గట్టి షాక్ ఇచ్చింది. పీఏసీలో మొత్తం 12 పదవులు ఉంటాయి. పేఏసీ కమిటీలో సభ్యుడుగా ఉండాలీ అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఓట్లు ఉండాలి. వైసీపీకి ఆ ఓట్ల బలం లేదు, 11 మందే ఉన్నారు. దాంతో వైసీపీ తరఫున పీఏసీ చైర్మన్ గా నామినేషన్ వేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చాన్స్ లేదని అంటున్నారు.
అయితే తమకు శాసనమండలిలో బలం ఉందని వైసీపీ వాదిందినా అసెంబ్లీ నుంచే పీఏసీ చైర్మన్ అవుతారని కూటమి నేతలు వాదిస్తున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ శాసనసభకు గైర్ హాజరు అవుతూ వచ్చింది. దాంతో పాటు వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లుగా రాజకీయం ఉంది.
ఈ క్రమంలో సరైన సమయంలో ఈ విధంగా పొలిటికల్ షాక్ ఇచ్చారని అంటున్నారు. వాస్తవానికి పీఏసీ చైర్మన్ సహా సభ్యులను ఆయా పార్టీల నుంచి తీసుకుని సభాపతి ప్రకటిస్తారు అని అంటున్నారు. అయితే పీఏసీ పదవి సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి ఇవ్వాల్సి ఉంది. కానీ ఎన్నికలు అని ముందుకు తేవడంతో కూటమి వ్యూహంలో వైసీపీ తేలిపోయింది అని అంటున్నారు. ఇక పెద్దిరెడ్డి నామినేషన్ పత్రాలను కూడా ఒక దశలో అధికారులు తీసుకోకపోవడంతో బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత పెద్దిరెడ్డి నామినేషన్ తీసుకున్నారు
అయితే నామినేషన్ అయితే ఇవ్వగలిగారు కానీ పదవిని మాత్రం అందుకోలేకపోయారు అని అంటున్నారు. పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబుగా కూడా చిత్తూరు జిల్లాలో పాలిటిక్స్ ఉంది. అటువంటిది ఆయనకు కేబినెట్ ర్యాంక్ పదవిని ఇస్తారా అన్నది కూడా చర్చగా ఉంది.
అయితే పీఏసీ చైర్మన్ ఎన్నికను అడ్డం పెట్టుకుని కూటమి చేస్తున్న పాలిటిక్స్ ని జనంలో పెట్టి ఎండగట్టాలని వైసీపీ ఈ విధంగా ప్లాన్ చేసింది అని అంటున్నారు. జగన్ అసెంబ్లీకి రా వాలని కోరుతున్న వారు అంతా కూటమి పెద్దలు పీఏసీ విషయంలో వ్యవహరించిన తీరుని చూడమని జనం ముందు చెప్పేందుకే ఆ పార్టీ నామినేషన్ వేసింది అని అంటున్నారు. మొత్తానికి జనసేనకు ఈ మధ్యలో చాన్స్ దక్కింది అని అంటున్నారు ఆ పార్తీకి పీఏసీ పదవి ఖాయమైనందువల్ల మొత్తం నాలుగు కేబినెట్ పోస్టులు దక్కినట్లు అయింది అని అంటున్నారు.