గత కొంతకాలంగా - తీపి చేదుల మిశ్రమం అన్నట్లుగా సాగుతున్న ఐటీపరిశ్రమలో తాజాగా భారీ తీపికబురు తెరమీదకు వచ్చింది. ఐటీ అంటే ఒకనాడు ఉన్న క్రేజ్ పోయి....షాకుల పరంపర అనే విశ్లేషణ వినవస్తున్న సమయంలో...భారీ ఉద్యోగాల ప్రకటన వెలువడింది. ఒకే కంపెనీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40,000 ఉద్యోగాల భర్తీకి ఓకే చెప్పేసింది. ఇదంతా దేశవ్యాప్తంగానో మరోచోటో కాదు...ఒక్క హైదరాబాద్ లోనే!. ఇంతకీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్న సంస్థ ఏదంటే డెలాయిట్.
ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల్లో ఒకటైన డెలాయిట్ కి ప్రస్తుతం హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు 40,000 మంది ఉద్యోగులున్నారు. ఇక్కడ ప్రపంచ మార్కెట్ కోసం సంస్థ జరిపే కొన్ని కీలక ఆవిష్కరణలకు ఇది కేంద్రంగా ఉంది. భారత్ లో కంపెనీకి ముంబై - బెంగుళూరు - ఢిల్లీ (గురుగ్రామ్)లలో కూడా కీలక కార్యాలయాలు ఉన్నాయి. రాబోయే కొన్నేళ్లలో అక్కడ కూడా ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నారు. దేశంలో డెలాయిట్ కి బెంగుళూరు రెండో పెద్ద కేంద్రంగా ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో కలిపి 9,000-10,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే, హైదరాబాద్ కేంద్రంగా తమ ఉద్యోగులను రెట్టింపు చేసుకోనున్నట్లు సంస్థ ప్రకటించింది.
డెలాయిట్ ఇండియా టెక్నాలజీ - మీడియా - టెలికామ్ లీడర్ హేమంత్ జోషి తాజాగా మీడియాతో మాట్లాడుతూ - రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో భారత్ లోనే తన అతిపెద్ద కేంద్రమైన హైదరాబాద్ లో ఉద్యోగుల సంఖ్యను సుమారుగా 80,000కి పెంచాలని నిర్ణయించిందని వెల్లడించారు. ``హైదరాబాద్ లో మాకు ఇప్పుడు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతానికి ఇదే అతిపెద్ద కార్యాలయం. కానీ కొన్నేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు చేయనున్నాం’ అని తెలిపారు. అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి - ఇతర మార్గాలలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన చాలా మంది ఇంజనీర్లు - సాఫ్ట్ వేర్ నిపుణులను ప్రత్యేక టెక్నాలజీ నైపుణ్యాలు - ఇతర రంగాలలో నియమిస్తున్నట్టు జోషి తెలిపారు. డెలాయిట్ గ్లోబల్ టెక్ - మీడియా - టెలికామ్ ఇండస్ట్రీ లీడర్ పాల్ సలోమీ మాట్లాడుతూ - టాక్సేషన్ - మొబిలిటీ - ఐటీ సిస్టమ్స్ - మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ - కన్సల్టింగ్ సర్వీసెస్ - సిస్టమ్ ఇంటెగ్రేషన్ - ఫైనాన్స్ ఫంక్షన్స్ వంటి డొమైన్ లలో నియామకాలు జరుపనున్నట్టు వివరించారు.