అంతకంతకూ పెరిగిపోతున్న బంగారం ధరలు.. తాజాగా దాని డిమాండ్ తగ్గేలా చేసిన పరిస్థితి. గడిచిన మూడు నెలల్లో దేశీయంగా బంగారం గిరాకీ ఎంత తగ్గిందన్న విషయాన్ని తెలియజేసే తాజా నివేదిక ఒకటి బయటకు వచ్చింది. బంగారం డిమాండ్ మన దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా అలాంటి పరిస్థితే ఉందన్న విషయం ఈ నివేదిక వెల్లడించింది. గత ఏడాది అంటే 2022 జనవరి - మార్చిలో 135.5 టన్నులు ఉంటే.. ఈ ఏడాది 2023 (జనవరి-మార్చి) మొదటి మూడు నెలల కాలానికి కేవలం 112.5 టన్నులకే పరిమితం కావటం గమనార్హం.
ఎందుకిలా? అసలు కారణం ఏమిటి?పసిడి మీద మోజు తగ్గటమా? లాంటి సందేహాలు రావొచ్చు. కానీ.. అసలుకారణం బంగారం ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గులే అసలు కారణంగా చెబుతున్నారు. బంగారం ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నవేళ.. తొందరపడి కొనే బదులుగా కాస్త వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా చెబుతున్నారు.
బంగారం మాత్రమే కాదు.. బంగారు ఆభరణాల మార్కెట్ సైతం డిమాండ్ లేకపోవటం గమనార్హం. గత ఏడాదిలో బంగారు ఆభరణాల గిరాకీ 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు తగ్గినట్లుగా తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.
2010 తర్వాత జనవరి - మార్చి సీజన్ లో పసిడి ఆభరణాలకు గిరాకీ 100 టన్నుల కంటే తక్కువగా నమోదు కావటం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. పసిడి ధరలు భారీగా పెరగటంతో వీటిని కొనుగోలు చేసే విషయంలో వాయిదా వేసుకుంటున్నారని చెబుతున్నారు. ధరలు తగ్గినంతనే కొనాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ధర విషయానికి వస్తే గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగింది.
కొత్త బంగారాన్ని కొనలేని చాలామంది పాత బంగారాన్ని మార్చి.. కొత్త నగలు చేయించుకోవటం మీద ఆసక్తిని చూపిస్తున్నట్లు చెబుతున్నారు. డిజిటల్ పద్దతిలో బంగారం మీద మదుపు చేయటం కూడా ఎక్కువగా ఉందంటున్నారు.
ఈ ఏడాది మొత్తం పసిడి గిరాకీ పెద్దగా ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ ఏడాది పసిడి గిరాకీ 750-800 టన్నుల మధ్య ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగానే కాదుఅంతర్జాతీయంగానూ ఇలాంటి పరిస్థితే ఉందని.. జనవరి - మార్చిలో 1238.5 టన్నులుగా ఉండాల్సిన గిరాకీ 1080.8 టన్నులకు పరిమితం కావటం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.