ట్రంప్ ట్వీట్ టాయిలెట్ పేప‌ర్ల‌కు డిమాండ్!

Update: 2017-08-05 18:01 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్ష ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేసిన ట్వీట్లు ఎంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఆ స‌మ‌యంలో ట్రంప్ చేసిన వివాదాస్ప‌ద ట్వీట్లు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. ఓ సంస్థ వారు ఏకంగా ఆ ట్వీట్లన్నింటినీ క‌లిపి న్యూయార్క్ లో ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టిసారి ఓ దేశాధ్య‌క్షుడు చేసిన ట్వీట్ల‌కు ఏకంగా ఓ మ్యూజియం ఏర్పాటు చేశారంటే ఆ ట్వీట్ల స్పెషాలిటీ అర్థం చేసుకోవచ్చు. తాజాగా, ట్రంప్ ట్వీట్లు మళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చాయి. ఈ సారి ఏకంగా ఆయ‌న ట్వీట్ల‌ను టాయిలెట్ పేప‌ర్లపై ముద్రించారు.

డొనాల్డ్ ట్రంప్ టాయిలెట్ పేపర్‌పైకి ఎక్కడమేంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. అమెజాన్ సంస్థ విక్రయిస్తున్న టాయ్‌లెట్ పేపర్లపై ట్రంప్ ఫోటోతో పాటు, ఆయన తరచూ చేసే ట్వీట్లు ముద్రించారు. అమెరికన్లకు ట్రంప్‌ పాత ట్వీట్లను టాయిలెట్ లో చదువుకోవాల‌నే ఉద్దేశంతో స‌ర‌దాగా ఈ ట్వీట్ల‌ను ఆ పేపర్ పై ముద్రించింది అమెజాన్ సంస్థ. ఎన్నికల సందర్భంగా ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, రష్యాకు మ‌ద్ద‌తుగా ఆయ‌న చేసిన ట్వీట్లు ఆ టాయ్‌లెట్ పేపర్‌పై దర్శనమిస్తున్నాయి. ఈ ట్రంప్ టాయిలెట్ పేప‌ర్ల‌కు భలే డిమాండ్ వ‌చ్చింది.

ప్ర‌స్తుతం పది డాలర్లకు ఒక్కటి చొప్పున ఆ పేపర్లు హాట్ కేకుల్లా అమ్ముడవడం విశేషం. గతంలో కూడా టాయ్‌లెట్ పేపర్లపై ట్రంప్ ఫోటోలు ముద్రించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆ ఫొటో పేప‌ర్ల‌ను12 డాలర్లు చొప్పున విక్రయించారు. ఇప్పుడు ఏకంగా ట్రంప్ ట్వీట్లను టాయ్‌లెట్ పేపర్లపై ముద్రించి విక్రయిస్తున్నారు. అమెరికాలో తమకు నచ్చని నాయకుడి ఫోటో ఉన్న టాయ్‌లెట్ పేపర్లకు గిరాకీ ఎక్కువ‌ట‌. ఈ విష‌యాన్ని అమెజాన్ సంస్థ బాగా క్యాష్ చేసుకుంటోంది. ట్రంప్‌ ట్వీట్లు ఉన్న టాయ్‌లెట్ పేపర్లను కొనుగోలు చేస్తున్నారంటే....అమెరికాలో ట్రంప్ పై ఎంత వ్య‌తిరేక‌త ఉందో తెలుస్తోంది.
Tags:    

Similar News